हिन्दी | Epaper
నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Andhra Pradesh: వైసిపి ట్రాప్ లో పడొద్దు: డి.సిఎం పవన్ కల్యాణ్

Rajitha
Andhra Pradesh: వైసిపి ట్రాప్ లో పడొద్దు: డి.సిఎం పవన్ కల్యాణ్

విజయవాడ : ప్రత్యర్థి రాజకీ యపక్షాలపై సిద్ధాంతపరంగానే విమర్శలు చేయాలని, సున్నిత పరిస్థితులకు ఆస్కారం కల్పించవద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (pawan kalyan) జనసేన కార్యకర్తలకు మార్గదర్శనం చేసారు. వైఎస్సార్సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎందుకు తిప్పి కొట్టడం లేదు. మహిళల విషయంలో పార్టీ శ్రేణులు జాగ్రత్తగా ఉండాలి. మహిళలకు మీ చేయి తగిలినా రేప్ చేశారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తారు. వైఎస్సార్సీపీ నేతల ట్రాప్లో చిక్కుకోవద్దు. అన్నింటికీ నేనే మాట్లాడితే ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నది ఎందుకు? జనసేన నేతలు మాత్రం సిద్ధాంతపరంగా, సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలన్నారు..

Read also: AP: నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

Don't fall into the YCP trap: DCM Pawan

Don’t fall into the YCP trap: DCM Pawan

త్వరలో 32 మందితో క్రమ శిక్షణ కమిటీ ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలపై అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదని నేతలను ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నేతల ట్రాప్లో పడొద్దని నేతలను పవన్ హెచ్చరించారు. అన్నింటికీ తానే మాట్లాడితే ఇక ఎమ్మెల్యేలు, మంత్రులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు ఎందుకని ప్రశ్నించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీని ప్రజలకు వివరించి వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని జనసేన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానించినట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఎవరూ ప్రవర్తించవద్దని

చుక్క పాలు లేకుండా తీసిన వైఎస్సార్సీపీ నేతలు సిగ్గు లేకుండా నెయ్యి సరఫరా చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దీనిపై జనసేన నేతలు బాధ్యత తీసుకుని ఖండించాలన్నారు. కేంద్ర బడ్జెట్ను స్వాగతిస్తూ మరో తీర్మానం చేసినట్లు మనోహర్ చెప్పారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయం సమావేశంలో చర్చకు వచ్చిందని త్రిసభ్య కమిటీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. వ్యక్తిగత విషయాలతో పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఎవరూ ప్రవర్తించవద్దని పవన్ గట్టిగా ఆదేశించినట్లు మనోహర్ చెప్పారు. ఓటు రాజకీయాల కోసం ప్రజల్లో చీలిక తెచ్చేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోందని, ఆ ఉచ్చులో పడొద్దని జనసేన నేతలకు స్పష్టం చేశారు.

త్వరలో 32 మందితో క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు

సమావేశంలో తన ప్రసంగాన్ని పవన్ కల్యాణ్ కొనసాగిస్తూ నేతలను వారి కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని జాగ్రత్తగా ఉండాలని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. సిద్ధాంత, సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలని సూచించారు. త్వరలో 32 మందితో క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేస్తామన్న పవన్ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో మార్పులు చేస్తామన్నారు. వ్యక్తిగత వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, తమ వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని పవన్ అన్నారు. శాంతి భద్రతల సమస్యలు రాకుండా చూడాలన్న అధినేత భౌతిక దాడులు జనసేన విధానం కాదన్నారు. విమర్శలకు విషయంతోనే సమాధానం చెబుదామన్న పవన్ మంగళగిరిలోని దిరీ కన్వెన్షన్లో నిర్వహించిన కార్యవర్గ సమావేశాన్ని కొనసాగించాలని పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కు చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870