हिन्दी | Epaper
గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు

Asifabad: ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్

Tejaswini Y
Asifabad: ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్

Asifabad: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. హరిత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ బి. వినోద పై వచ్చిన సమాచారంపై జిల్లా కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా కళాశాలను సందర్శించిన సమయం లో ప్రిన్సిపాల్ విధులకు గైర్హాజరు కావడం, ప్రిన్సిపల్ కార్యాలయ గదికి తాళం వేసి ఉందని, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులతో విచారణ జరిపినప్పుడు, ప్రిన్సిపాల్ ఈ నెల 29వ తేదీ నుండి తన చట్టబద్ధమైన విధులకు హాజరు కాలేదని, ఆసిఫాబాద్ లో లేరని తెలిసిందని ప్రధాన కార్యాలయాన్ని వదిలివెళ్లేందుకు ప్రిన్సిపల్ ఎలాంటి ముందస్తు అనుమతి పొందలేదని తెలిపారు.

Read Also: HYD Crime: హుస్సేన్‌సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య?

Asifabad: Principal of Government Nursing College suspended
Asifabad: Principal of Government Nursing College suspended

విద్యా తరగతులు ప్రారంభించలేదని విద్యార్థులు

డిసెంబర్ 2025లో విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు విద్యా తరగతులు ప్రారంభించలేదని విద్యార్థులు, అధ్యాపకులచే నిర్ధారించబడిందని, విద్యార్థులు అపరి శుభ్రమైన పరిస్థితుల్లో ఉంటున్నారని, వారికి నాణ్యత లేని ఆహారం అందించబడుతుందని గమనించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులతో శుభ్రపరిచే పనులు, ప్రిన్సిపాల్ వ్యక్తిగత పనులు, వీధి కుక్కలు, పిల్లులకు ఆహారం పెట్టడం, వాటి పోషణ వంటి అంశాలపై ఒత్తిడి తెస్తున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారని తెలిపారు. విద్యార్థినుల వసతి గృహంలో .. కెమెరా అమర్చడం జరిగిందని, విద్యార్థినులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ కారణంగా ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయడం జరిగిందని, క్రిమినల్ అభియోగాలకు సంబంధించిన అన్ని చర్యలను ముగించే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపారు. ఈ కాలంలో ప్రిన్సిపల్ బి. వినోద హెడ్క్వార్టర్స్ ఉండాలని, ముందస్తు అనుమతి పొందకుండా. ప్రధాన కార్యాలయం నుండి బయటకు వెళ్లకూడదని తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870