రేపు ఉదయం ఢిల్లీ (Delhi) లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన, నేషనల్ డెమోక్రటిక్ అల్లయన్స్ (NDA) సమావేశం జరగనుంది. ఈ భేటీలో బడ్జెట్ విశేషాలు, వికసిత్ భారత్@2047 విజన్, పార్లమెంటరీ అజెండాలపై చర్చించనున్నారు. మోదీ MPలకు దిశానిర్దేశం చేస్తారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడమే లక్ష్యంగా వ్యూహరచన చేయనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన సహా కూటమి పార్టీల ఎంపీలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
Read Also: India US tariff: గుడ్ న్యూస్.. భారత్ పై టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్

ఏమి చర్చించనున్నారు?
- ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఫీచర్లు, ముఖ్య అంశాలను ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తారు.
- పార్లమెంట్‌లో ప్రభుత్వ బిల్లులు, లెజిస్లేటివ్ ప్రయారిటీలు, ఆర్థిక విధానాలు, గవర్నెన్స్ అంశాలపై చర్చ.
- ప్రధాన మంత్రి మోదీ ప్రసంగంలో పొలిటికల్, గవర్నెన్స్ ఇష్యూస్, పార్లమెంటరీ అజెండాపై దృష్టి సారిస్తారని తెలుస్తోంది.
- హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ తదితర కీలక నేతలు ఈ సమావేశానికి హాజరవుతారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: