అమెరికా (USA) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. భారత్ పై విధిస్తున్న టారిఫ్‌లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా, డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. “ఈ అద్భుతమైన ప్రకటన చేసినందుకు 1.4 బిలియన్ల భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్‌కు పెద్ద ధన్యవాదాలు” అని, ట్రంప్ శాంతి ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుందని మోదీ తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల తరపున ట్రంప్ కి కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: Delhi: రేపు NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం
అద్భుత నిర్ణయం
రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచ శాంతికి ట్రంప్ నాయకత్వం కీలకం అని ప్రధాని మోదీ అన్నారు.”మేడిన్ ఇండియా ఉత్పత్తులపై సుంకాలను 18శాతానికి తగ్గించడం అద్భుత నిర్ణయం. భారత్, అమెరికా సహకారం రెండు దేశాలకు ఎంతో ప్రయోజనకరం. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రంప్ తో కలిసి పని చేయాలని ఆశిస్తున్నా. ప్రపంచంలో రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తున్నాయి” అని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: