ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లోక్‌సభలో 2026 (Budget 2026) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రసంగంలో ఆమె ప్రస్తావించిన Orange Economy దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. సంప్రదాయ పరిశ్రమలతో పాటు సృజనాత్మక రంగాలే భవిష్యత్ ఆర్థిక వృద్ధికి ఇంధనమవుతాయన్న దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ముందడుగులలో ఇది కీలకమైనదిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: Budget 2026: బడ్జెట్లో బంగ్లాదేశ్‌కు భారీ కోతతో భారత్ గుణపాఠం
ఆరెంజ్ ఎకానమీ
మీడియా, వినోదం, మేధోసంపత్తి లాంటి క్రియేటివ్ రంగాలను సూచించే పదాన్నే ఆరెంజ్ ఎకానమీ అని పిలుస్తారు. ఆర్థిక సర్వే 2025-26 (Budget 2026) ఆధారంగా దీనికి సంబంధించి ఈ ప్రతిపాదనను రూపొందించారు. ఆరెంజ్ ఎకానమీ అనే పేరును మొదటగా కొలంబియా మాజీ అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ మార్క్వెజ్, మాజీ సాంస్కృతిక మంత్రి ఫెలిపే బుయిట్రాగో రూపొందించారు. నారింజ రంగు అనేది ప్రపంచ సాంస్కృతిక, సృజనాత్మక సామర్థ్యాన్ని సూచిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 10 ప్రధాన నగరాల్లో “క్రియేటివ్ స్టార్టప్ హబ్స్” ఏర్పాటు చేయనున్నారు.

ఇక్కడ కంటెంట్ క్రియేటర్లకు కావాల్సిన అత్యాధునిక స్టూడియోలు, సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉంటాయి. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగంలో స్టార్టప్‌లు పెట్టే యువతకు ప్రత్యేక పన్ను రాయితీలు ఉంటాయి. కళాకారులు, డిజిటల్ క్రియేటర్ల నైపుణ్యాన్ని పెంచడానికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే భారతీయ సినిమాలు, సంగీతం, డిజిటల్ కంటెంట్‌ను గ్లోబల్ మార్కెట్లో ప్రచారం చేయడానికి ప్రత్యేక నిధులను కేటాయించనున్నారు. సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో కేవలం చదువు మాత్రమే కాకుండా,కళల ద్వారా కూడా లక్షలాది మంది యువతకు ఉపాధి దొరుకుతుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: