తమిళనాడు (Tamil Nadu) లోని, చెంగల్పట్టు లో, మరోసారి మానవత్వాన్ని కలచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. చెంగల్పట్టు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 15ఏళ్ల బాలిక ప్లస్వన్
చదువుతోంది. ఇదిలా ఉండగా బాలిక స్థానికంగా ఓ యువకుడితో సన్నిహితంగా ఉండటంతో గర్భం దాల్చింది. విషయాన్ని ఇంట్లో చెప్పకుండా దాచింది. ఈ క్రమంలో అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
Read Also: Karnataka: రంజాన్ ఫిబ్రవరి 17 లేదా 18న ప్రారంభమయ్యే అవకాశం

కేసు నమోదు
అక్కడ పరీక్షించిన వైద్యులు బాలిక 10 వారాల గర్భంతో ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో బాలికకు ఇంట్లోనే గర్భస్రావం చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు చెన్నై రాజీవ్ంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఆసుపత్రి తరపున పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి బాలికను గర్భవతిని చేసిన యువకుడి కోసం గాలిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: