
అమెరికాలోని ప్రఖ్యాత మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. సాధారణంగా ఇక్కడ జరిగే బాక్సింగ్, రెజ్లింగ్, మ్యూజిక్ ఈవెంట్స్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంటాయి. అయితే ఈసారి జరిగిన ఓ బాక్సింగ్ మ్యాచ్‌లో చోటుచేసుకున్న వింత సంఘటన సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. అమెరికన్ బాక్సర్ జారెల్ “బిగ్ బేబీ” మిల్లర్, కింగ్స్లీ ఇబే మధ్య జరిగిన పోరులో ఈ సరదా ఘటన జరిగింది. శనివారం జరిగిన ఈ బౌట్‌లోని రెండో రౌండ్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Read Also: T20 World cup 2026: మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామన్న PCB.. స్పందించిన ఐసీసీ
అమ్మ షాంపూ వల్లే జుట్టు ఊడిపోయింది
కింగ్స్లీ ఇబే వరుసగా పంచ్‌లు విసరడంతో జారెల్ తలకు పెట్టుకున్న విగ్గు కదిలి, కాసేపటికి పూర్తిగా ఊడి కిందపడిపోయింది. అయితే, ఈ పరిణామానికి జారెల్ ఏమాత్రం చలించకుండా, ఆ విగ్గును తీసి ప్రేక్షకుల పైకి విసిరేశాడు. దీంతో అభిమానులు కేరింతలు కొట్టారు.మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై జారెల్ స్పందిస్తూ ఓ ఫన్నీ కారణం చెప్పాడు. తన తల్లి వాడిన షాంపూ తను వాడడం వల్లే ఇలా జరిగిందని చెప్పి అందర్నీ నవ్వించాడు.
“రెండు రోజుల క్రితం మా అమ్మ ఇంట్లో ఉన్న షాంపూతో తలస్నానం చేశాను. అది అమ్మోనియం బ్లీచ్ లాంటిది కావడంతో నా జుట్టు మొత్తం ఊడిపోయింది. అందుకే వెంటనే నా మేనేజర్‌కు ఫోన్ చేసి ఓ విగ్గు తెప్పించుకుని పెట్టుకున్నాను. నేనో కమెడియన్ని, నాపై నేనే జోకులు వేసుకోగలను” అని వివరించాడు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: