हिन्दी | Epaper
గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు

Charlapalli: కుటుంబ ఆత్మహత్య కారణాలు!

Saritha
Charlapalli: కుటుంబ ఆత్మహత్య కారణాలు!

హైదరాబాద్ (Hyderabad) శివార్లలో జరిగిన తల్లీబిడ్డల ఆత్మహత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. (Charlapalli) చర్లపల్లి-ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్‌పై ఐటీ ఉద్యోగిని విజయరెడ్డి తన ఇద్దరు పిల్లలు చేతన, విశాల్‌తో కలిసి బలవన్మరణానికి పాల్పడటం తెలిసిందే. ఈ దారుణానికి ఆమెలో పేరుకుపోయిన ఒంటరితనమే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

ఉప్పల్ రాఘవేంద్రనగర్‌ కాలనీకి చెందిన విజయరెడ్డికి సురేందర్‌రెడ్డితో 2007లో వివాహమైంది. భర్త సురేందర్‌రెడ్డి నాలుగేళ్లుగా దుబాయ్‌లో ఉద్యోగం చేస్తుండటంతో, విజయరెడ్డి తన తల్లితో కలిసి ఉంటున్నారు. నగరంలోని ఓ ఐటీ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్న ఆమె, నైట్ షిఫ్టుల కారణంగా పిల్లలిద్దర్నీ హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నారు. అయితే, భర్తకు దూరంగా ఉండటం, పిల్లలు కూడా అందుబాటులో లేకపోవడంతో గత 15 రోజులుగా ఆమె తీవ్రమైన ఒంటరితనంతో బాధపడుతున్నట్లు బంధువులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని స్నేహితులతో చెబుతూ ఆవేదన చెందేవారని తెలిసింది.

Read Also: Budget 2026: బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు దక్కేవి ఇవే.. !!

Charlapalli: కుటుంబ ఆత్మహత్య కారణాలు!

ఆత్మహత్యకు గల కారణాల పై కొనసాగుతున్న దర్యాప్తు

శనివారం తెల్లవారుజామున హాస్టల్ నుంచి పిల్లలను కారులో తీసుకెళ్లిన విజయరెడ్డి, (Charlapalli) చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద కారు పార్క్ చేశారు. అక్కడే పార్కింగ్ స్లిప్ వెనుక “నాకు బతకాలని లేదు. నేను లేకపోతే పిల్లలు అనాథలవుతారు. అందుకే నాతో పాటే తీసుకెళ్తున్నా” అని సూసైడ్ నోట్ రాశారు. ఆ నోట్‌ను ఫొటో తీసి తన వాట్సప్ స్టేటస్‌గా కూడా పెట్టుకున్నట్లు తెలిసింది. అనంతరం పిల్లలతో కలిసి గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.

ఘటనా స్థలంలోని కారు నుంచి సూసైడ్ నోట్‌ను, విజయరెడ్డి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపనున్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె ఎవరితో మాట్లాడారు, చాటింగ్ వివరాలపై ఆరా తీస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870