हिन्दी | Epaper
గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు

Grammy Award: దలైలామాకి ప్రతిష్ఠాత్మక అవార్డ్

Anusha
Grammy Award: దలైలామాకి ప్రతిష్ఠాత్మక అవార్డ్

టిబెట్‌కు చెందిన ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. ఆయనకు ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డు (Grammy Award) వరించింది. బెస్ట్‌ ఆడియో బుక్‌ నెరేషన్‌ విభాగంలో ‘మెడిటేషన్’ అనే ఆల్బమ్‌కు ఈ అవార్డు దక్కింది. ఇందులో ఆయన తన ఆలోచనలు, సందేశాలను ఆడియో రూపంలో అందించారు. సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ అవార్డును 90 ఏళ్ల వయసులో సాధించారు.

Read Also: TG: సీఎం రేవంత్ కి ప్రఖ్యాత హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి ఆహ్వానం

Dalai Lama wins prestigious Award
Dalai Lama wins prestigious Award

భావోద్వేగ ప్రసంగాలు

ఈ అవార్డును దలైలామా తరఫున ప్రముఖ సంగీతకారుడు రూఫస్ వేన్‌రైట్ స్వీకరించారు.ఈ వేడుకలో పలు విభాగాల్లో యువ గాయకులు, బృందాలు సత్తా చాటగా, సీనియర్ కళాకారులు కూడా తమ ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు.పాప్, రాక్, జాజ్, క్లాసికల్, హిప్‌హాప్ వంటి విభిన్న శైలుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు అందజేశారు. సంగీత ప్రదర్శనలు, లైవ్ పెర్ఫార్మెన్స్‌లు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

వేడుకలో పలువురు కళాకారులు తమ సంగీత ప్రయాణం, సృజనాత్మకతపై భావోద్వేగ ప్రసంగాలు చేయడం కూడా ప్రత్యేకంగా నిలిచింది. గ్రామీ అవార్డులు కేవలం సంగీతానికి మాత్రమే కాకుండా సాహిత్యం, ఆడియో బుక్స్, నెరేషన్ వంటి విభాగాలకు కూడా ప్రాధాన్యతనిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రతిభను గౌరవిస్తాయని ఈసారి మరొకసారి స్పష్టమైంది. 90 ఏళ్ల వ‌య‌స్సులో తొలి గ్రామీ అవార్డ్‌ని ద‌క్కించుకొని రికార్డ్ సృష్టించారు ద‌లైలామా.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870