हिन्दी | Epaper
గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు గోల్డ్ రేట్స్ రాశి ఫలాలు ఏపీ కేబినెట్ ఎయిర్‌టెల్ షాక్ H-1B వీసా షాక్ నిర్మల సీతారామన్ పెరిగిన నూనె రేట్లు పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు అనంతలో దారుణం ముగియనున్న ఉపసంహరణ గడువు ఉత్తరాది నేరగాళ్లు

AP: అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్‌

Anusha
AP: Ambati Rambabu remanded for 14 days
AP: Ambati Rambabu remanded for 14 days

ఆంధ్రప్రదేశ్ (AP) రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆదివారం రాత్రి న్యాయమూర్తి జి. స్రవంతి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. శనివారం గుంటూరులోని గోరంట్ల వద్ద అంబటి రాంబాబు వాహనంలో వెళ్తూ పోలీసులతో పాటు ముఖ్యమంత్రిపై వ్యక్తిగత దూషణలకు పాల్పడిన ఘటన తీవ్ర దుమారం రేపింది. దీనిపై TDP శ్రేణులు అంబటి ఇల్లు, కార్యాలయంపై దాడి చేశాయి.

Read Also: East Godavari: రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతి

అసలు ఏమి జరిగిందంటే?

తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీపై గుంటూరులో ‘మహాపాపం’ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్దకు  అంబటి రాంబాబు వెళ్లారు. ఫ్లెక్సీని 24 గంటల్లో తొలగించాలని, లేకపోతే తామే తొలగిస్తామని హెచ్చరించారు. శనివారం ఉదయం అంబటి గోరంట్లలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఫ్లెక్సీ ఉన్న రోడ్డులో కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి.ఆగ్రహించిన అంబటి కారులో నుంచి బూతులు తిట్టాడు. రండిరా నా కొడకల్లారా రండిరా అంటూ విరుచుకుపడ్డారు.

అదే సమయంలో అంబటితోపాటు కారులో ఉన్నవారు తీసిన వీడియోల్లో బూతులన్నీ రికార్డయ్యాయి. అసభ్య దూషణలపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కారుపై కర్రలతో దాడి చేశాయి. అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు అంబటికి చెప్పినా వినిపించుకోకుండా మళ్లీ బూతులతో రెచ్చగొట్టారు. ఆయన కారులో నుంచి దిగేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. చివరకు అద్దాన్ని కిందకు దించి సీఎం చంద్రబాబుపై అసభ్య భాష వాడి దూషించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870