భారతదేశ ఆర్థిక చరిత్రలో బడ్జెట్ అనేది కేవలం అంకెల గారడీ మాత్రమే కాదు, అది దేశ గమనాన్ని మార్చిన ఒక దిక్సూచి. కొన్ని బడ్జెట్లు సామాన్యులకు ఊరటనిస్తే.. మరికొన్ని కఠిన నిర్ణయాలతో మనల్ని ఆలోచింపజేశాయి. అయితే మొత్తం భారతదేశ చరిత్రలో ముఖ్యంగా రెండు బడ్జెట్లు(Budget) మాత్రం దేశ గమనాన్నే మార్చాయి. ఒకటి సంక్షోభంలో పుట్టిన ‘బ్లాక్ బడ్జెట్’, ఇంకోటి ఆశలను చిగురింపజేసిన ‘డ్రీమ్ బడ్జెట్’. బతకడమే కష్టంగా మారిన ‘బ్లాక్ బడ్జెట్’ అది 1973వ సంవత్సరం. అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంతరావు బి. చవాన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ భారత చరిత్రలో ‘బ్లాక్ బడ్జెట్’ (Black Budget) గా నిలిచిపోయింది. అసలు దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? అప్పట్లోనే మన దేశం రూ. 550 కోట్ల భారీ లోటును (Fiscal Deficit) ఎదుర్కొంది. ఆ రోజుల్లో అది ఒక ఊహించని పెద్ద అంకె. 1971 యుద్ధం వల్ల కలిగిన ఆర్థిక భారం, బంగ్లాదేశ్ శరణార్థుల రాక, దానికి తోడు 1972లో వచ్చిన భయంకరమైన కరువు.. ఇలా అన్నీ కలిసి దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీశాయి. ధరలు ఆకాశాన్ని అంటాయి. తిండికి కటకటలాడే పరిస్థితి ఏర్పడింది.
Read Also: Kaushik Reddy apology : పోలీసులకు క్షమాపణలు, కౌశిక్ రెడ్డి యూటర్నా?

బడ్జెట్ దేశ ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేసింది
ఈ గడ్డు కాలంలో ప్రభుత్వం బొగ్గు గనులను జాతీయీకరణ చేయడం వంటి సాహసోపేతమైన, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. కేవలం బ్రతకడమే లక్ష్యంగా సాగిన బడ్జెట్ అది. 1997: మధ్యతరగతికి వరమైన ‘డ్రీమ్ బడ్జెట్’ సరిగ్గా 24 ఏళ్ల తర్వాత 1997లో పి. చిదంబరం గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేసింది. దీనిని అందరూ ముద్దుగా ‘డ్రీమ్ బడ్జెట్’ (Dream Budget) అని పిలుచుకుంటారు. ఎందుకంటే, అప్పటివరకు ఉన్న భారీ పన్నులను ఆయన భారీగా తగ్గించారు. కార్పొరేట్ పన్నులను కూడా తగ్గించడంతో వ్యాపారాలు పుంజుకున్నాయి. ఫలితంగా 1997 లో కేవలం రూ. 18,700 కోట్లుగా ఉన్న ఆదాయపు పన్ను వసూళ్లు, 2013 నాటికి రూ. 2 లక్షల కోట్లకు పైగా పెరిగాయంటే ఆ బడ్జెట్ వేసిన పునాది ఎంత బలమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. గతం నేర్పిన పాఠం నేడు మనం కొత్త బడ్జెట్ (Budget 2026) కోసం ఎదురుచూస్తున్నాం. ఈ తరుణంలో ఈ పాత బడ్జెట్లు మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: