కర్నూలు (Kurnool) జిల్లాకు చెందిన విజయలక్ష్మి, జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా, వెనక్కి తగ్గకుండా ముందుకు సాగితే విజయం తప్పక వరిస్తుందన్న నిజాన్ని ఆమె నిరూపించారు. పేదరికం, కుటుంబ పరిస్థితులు, బాధ్యతలు… ఇవన్నీ ఆమెకు అడ్డంకులుగా నిలిచినా, వాటిని దాటుకుంటూ చివరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి అనేక మందికి స్ఫూర్తిగా మారారు. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం యల్లావత్తులకు చెందిన విజయలక్ష్మి,
Read Also: AP: మున్సిపాలిటీల్లో అభివృద్ధిపై మేథోమధనం

అనుకున్నది సాధించి
ఏపీపీఎస్సీ గ్రూప్-2లో అసిస్టెంట్ సెక్షన్ అధికారి (ఏఎస్వో)గా ఎంపికయ్యారు. ఇంట్లో పెద్దలు వద్దంటున్నా కూలి పనులకు వెళుతూ డిగ్రీ పూర్తి చేశారు.. వివాహమైందని అక్కడితో ఆగలేదు. జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలిపనులకు వెళుతూ.. రాత్రి వేళల్లో కష్టపడి చదివారు. ఇంతలో భర్త రోడ్డు ప్రమాదం గాయపడి మంచంలో ఉన్నారు. ఓ వైపు భర్తకు అండగా నిలుస్తూనే.. ఇటు చదువును కొనసాగించారు. కష్టాలన్నీ దాటుకుని చివరికి అనుకున్నది సాధించారు.. ప్రభుత్వ కొలువు సంపాదించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: