Medak Municipal Elections: మున్సిపల్ ఎన్నికల వేళ మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కి కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు పార్టీ ఫిరాయింపుల తో ఇబ్బందులు పడుతున్న పార్టీ కి రెబల్స్ బెడద మరింతగా ఇబ్బంది పెడుతోంది. మెదక్ మున్సిపల్ పరిధిలోని 32 వార్డుల్లో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇంకా బి ఫర్మ్ లు కన్ఫర్మ్ చేయలేదు. చేసిన వార్డ్ ల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన అభ్యర్థులు తిరుగుబాటు బావుటా ఎగరవేస్తున్నారు.
Read Also: Chandrababu Naidu: చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
6 మరియు 30 వార్డుల్లో గట్టి పోటీ ఇస్తున్న రెబల్ అభ్యర్థులు
అందులో ముఖ్యంగా 6వ వార్డు 30 వ వార్డ్ లో రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. 6 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హరిత పోటీ లో ఉండగా అదే పార్టీ కి చెందిన సమీ ఉల్లా ఖాన్ (లల్లూ) రెబల్ అభ్యర్థిగా బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ వార్డ్ లో ముస్లిం మైనార్టీ ఓటర్ లు ఎక్కువగా ఉండటం తో పాటు ఆయన పార్టీ సీనియర్ నాయకులు గా ఉన్న కాగ్రెస్ పార్టీ తనకు అన్యాయం చేసిందని ఆరోపిస్తూ బరిలో నిలిచారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆయనను బుజ్జగించడం లో పూర్తిగా విఫలం అయ్యారు. ఇక 30 వ వార్డు లో అ వార్డు కు ఎలాంటి సంబంధం లోని వ్యక్తి వెంకట రమణ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. కానీ అ వార్డ్ లో ముందుంచి కాంగ్రెస్ పార్టీ లో పని చేస్తూ గత ఎన్నికల్లో కొద్ది పాటి ఓట్ల తేడాతో ఓటమి పాలైన అఫ్జల్ కు టికెట్ దక్కలేదు.

దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగారు. అసలే పార్టీ కి ఆదరణ కరువువైన వార్డ్ లో సంబంధం లేని వ్యక్తి కి టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మరింత రెబల్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి మెదక్ పట్టణం లో కాంగ్రెస్ పార్టీ కి అన్ని ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఇప్పటికే పార్టీ మారి ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు ఈ రెబల్స్ తో మరింత ఇబ్బందులు ఎదురుకునే అవకాశం ఉంది. ఇదే పరిస్థితి పట్టణంలో ని మిగతా వార్డ్ లలో ఎఫెట్ చూపించక ముందే పార్టీ దిద్దు బాటు చర్యలు చేపడుతుందా లేదా వేచి చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: