మాసహాని కన్నా మర ణించ డమే మేలనుకునే రోజులు చూశాం! పరువు పోయాక ప్రాణాలతో బతికుండటం కన్నానుయ్యో, గొయ్యో చూసుకుంటే పోలేదా అని అసహ్యించుకొన్న కాలం ఎరుగుదు! కానీ ఇవాళ అవినీతి పైన చాకిరేవు పెట్టటానికి సిగ్గు పడని దౌర్భాగ్యం దాపురించింది. చెడు అంటే భరించలేని రోతతో నేడు స్పందించడం మానేశాం. మరింకా అధ్యయనాలు చేయాలా? ఇంతకన్నా నిర్లజ్జ ఎక్కడుంటుంది? మరి ఇంత బహిరంగ చర్చలతో పాపం ప్రక్షాళనమైపోతుందా? బహిరంగ చర్చ అనగానే ఏది మంచి, ఏది చెడు, ఏది నీతి, ఏది అవినీతి, ఏది ఆక్రమార్జన, ఏది సక్రమార్జన అంటూ ప్రశ్నోపనిషత్తు వల్లే వేయడమేగా. అవినీతి (corruption)కి ఎందుకు పాల్పడాల్సి వచ్చింది? నీతికి తిలోద కాలు ఎందుకు వదలాల్సి వచ్చింది? అంటూ సాగదీయడం ఫాలో అవుతుంది. విలువలు విలుప్తం కావడానికి దారితీసిన పరిస్థితులపై చర్చ, సదరు పరిస్థితులు ఉత్పన్నమైన కార ణాలపై సంవాదం. అందుకు సమాజమా, వ్యక్తులా? ఎవరు బాధ్యులని తర్జన భర్జనలు. దీనికి ముగింపు ఉండదు. అవినీతి (corruption)అనండీ, అక్రమార్జన అనండి, పెరగనిచ్చినన్నాళ్లు పెరగనిచ్చాం!. మొక్కయి ఎదిగి వస్తుండగానే నిర్ధాక్షిణ్యంగా పంచాల్సిన కర్తవ్యం మర్చిపోయింది సమాజం. మొక్కయి వంగనిది మానై వంగుతుందా? వంగలేదు. రాజకీయాలు పుచ్చి పోయాయి. ‘అవినీతి వృక్షానికి తల్లివేరు రాజకీయం’ అంటారు ప్రముఖులు. ప్రజస్వామ్య వ్యవస్థను ఎంచుకు న్నాం. ప్రజా స్వామ్యానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎన్నికలు. ఎంత ఖర్చు పెట్టి అయినా గెలవటమే ఎన్నికల ధ్యేయం. ఖర్చు పెట్టడానికి డబ్బెక్కడనుండి వస్తుంది? అనంతకోటి మార్గాలున్న సంగతి అందరికీ తెలిసిందే. వెనక్కి తిరిగి చూడకుండా డబ్బు వెద జల్లుతూ పోవాలంటే ఏ రంగాన్ని వదలకుండా ఎడాపెడా పిండి దండుకోవాలి. కబ్జాలు, కుంభ కోణాలు, లంచాలు, అధికార దుర్వినియోగం, అధికార పరమపద సోపానం స్వాయత్తం చేసుకోవటానికి ఎన్ని నిచ్చెనలుంటే అన్నిటి మీదుగా ఎగబాకాలి. ప్రాజెక్టులు తగలబడి పోయినా సరే టెండర్ల దశలోనే చిచ్చు రాజేయాలి. కాంట్రాక్టర్లతో కరచాలనాలు చేయాలి. రాజకీయాలు, అధికారులు, కాంట్రాక్టర్లు ముప్పేట గొలుసుగా పెనవడాలి. కమిషన్లు అం దినంత బొక్కాలి. ఊళ్లకు ఊళ్లు పంచుకోవటానికి దొరల వేషం కట్టిన దొంగలు సంఘటితమవ్వాలి. సంక్షేమం పేరిట ప్రవహించే నిధుల్నీ స్వాహా చేయాలి. కాగితం మీదలెక్కలు బొక్కలు కానరావు, లక్షలు, కోట్లు ఖర్చవుతున్నాయి. లక్ష్యా లు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే, కాకుల లెక్కలకు కొద వలేదు!
Read Also: http://Budget 2026: ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను రాయితీలు? ధరలు తగ్గే అవకాశం!

పైవాళ్లంతా అంటే మంత్రులు, రాజకీయనాయకులు మూడక్షరాల హోదా, బిరుదులు తగిలించుకొన్న బ్యూరో క్రాట్లు తెగబడి తినేస్తోంటే పదీకి పరక్కీ కక్కుర్తిపడేమూడో, నాలుగో తరగతి సిబ్బందంటే అందరికీ ఎందుకింత అక్కసు అని ఎన్జీవో సంఘాల నాయకులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. తాము పీక్కుతింటున్నవాళ్లు తమకనా బక్కవాళ్లే అన్న సంగతి వారికి జ్ఞాపకం రాదు. ‘ఉద్యోగులపై చిన్న ఆరోపణ వచ్చినా సరే తక్షణమే సస్పెండ్చేయడమో, మరొకరమైన చర్య తీసుకొంటున్నారు. అదే గనుక మంత్రులపై అభియో గాలు వస్తే ఏ విధమైన చర్యలు ఉండటం లేదు. అన్నిశాఖ లలో నియామకాలు, ప్రమోషన్లు, బదిలీలలో మంత్రులు తలదూర్చి అవినీతికి పాల్పడుతున్నారు. వారికి సంబంధించి న వారికి మేలు చేసి లక్షలు మింగేస్తున్నారు. నీతినిజాయితీ అధికారులు, సిబ్బందికి మొండిచెయ్యి చూపిస్తున్నారు. ఈ పద్ధతి మారాలి. తెలుగు రాష్ట్రాలలోని నీటిపారుదల శాఖకు సంబంధించిన కీలకపదవుల్లో ఉన్న వారికి ఆ శాఖకు సంబంధించిన కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారులు టెండర్లు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్ల దగ్గర నుండి కోట్లాది రూపాయలను వసూలు చేసి ముట్టచెప్తున్న ఆరోపణలు వస్తున్నా దర్యాప్తులు లేవు, చర్యలు లేవు. బహిరంగంగా జరుగుతున్న ఈ అవినీతి తతంగం గురించి తెలిసి కూడా ఆయా మంత్రులపైన చర్యలు ఎందుకు తీసు కోవడం లేదంటే జవాబు లేదు, దొరకదు! అదేవిధంగా పోలీసు శాఖ మంత్రులే కాకుండా, సంబంధిత మంత్రులు, నియోజక వర్గం శాసనసభ్యులకు తెలియకుండా పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహించే సబ్ ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ డివిజన్ డిఎసీపీల బదిలీలను జిల్లా, రేంజి రాష్ట్ర ఉన్నతాధికారులు చేయలేకపోతున్నారు. కొందరు ప్రజా ప్రతినిధులు శాసనసభ్యులకు లక్షల రూపాయలను ముట్ట చెప్పిన సబ్ ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలకు వారు కోరుకున్న చోటుకు బదిలీ చేయించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. లేదంటే దబిడి. ఇక రెవిన్యూతో పాటు ఇతర శాఖలపై మంత్రుల పెత్తనాలతో పాటు అవినీతి తారా స్థాయికి చేరుకుంటున్నా శిక్షించే నాథుడే లేదు. ప్రస్తుతం ఉన్న చట్టాల కు మరింత పదును పెట్టి నీతి నిజాయితీ వీటన్నిటిని మించిన సమర్థత కలిగిన అధికారులను నియ మించి, ముఖ్యంగా అవినీతి నిరోధక శాఖలో మితిమీరిపో తున్న రాజకీయ జోక్యానికి ఫుల్సాఫ్ పెట్టకపోతే. పాలకుల మాటలు, చట్టాలు అన్నీ నిరర్థకమే.
-ఎం. నారాయణ స్వామి
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: