हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

TMC vs BJP: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: మమతకు ఆధిక్యమేనా?

Pooja
TMC vs BJP: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: మమతకు ఆధిక్యమేనా?

ఈ ఏడాది పశ్చిమబెంగాల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం, తదుపరి లక్ష్యం బెంగాలేనని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఈ ఆసక్తిని మరింత పెంచాయి. అదే సమయంలో వరుసగా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న మమతా బెనర్జీకి నాలుగోసారి అవకాశం ఇవ్వకుండా నిలువరించాలన్న సంకల్పంతో ప్రత్యర్థి పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.

Read Also: Kajal Chaudhary: భార్యను చంపిన కేసులో వెలుగులోకి కీలక విషయాలు

TMC vs BJP
TMC vs BJP: West Bengal Assembly Elections: Will Mamata have the advantage?

మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఫలితాలు

ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇండియా టుడే నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వే కీలక అంశాలను వెలుగులోకి తెచ్చింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరిగితే బెంగాల్లో ఏ పార్టీ ఆధిక్యం సాధిస్తుందనే అంశంపై ఈ సర్వే జరిగింది. బెంగాల్‌లో సాధారణంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మధ్య పెద్దగా తేడా ఉండదన్న అంచనాల నేపథ్యంలో, ఈ సర్వేను రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సూచికగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

టీఎంసీకి మళ్లీ పైచేయి

సర్వే ప్రకారం, ఇప్పుడే ఎన్నికలు జరిగితే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) 2024 లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని(TMC vs BJP) దాదాపుగా పునరావృతం చేసే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బెంగాల్‌లోని 42 లోక్‌సభ సీట్లలో టీఎంసీ 29 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 12 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. తాజా సర్వే ప్రకారం కూడా ఫలితాలు ఇదే దిశగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

బీజేపీకి స్వల్ప లాభం

ఇండియా టుడే తాజా అంచనాల ప్రకారం, టీఎంసీ 28 ఎంపీ సీట్లు(TMC vs BJP) గెలుచుకునే అవకాశం ఉండగా, బీజేపీ తన బలాన్ని కొద్దిగా పెంచుకుని 14 సీట్లు సాధించవచ్చని పేర్కొంది. గత ఏడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో టీఎంసీకి 31 సీట్లు, బీజేపీకి 11 సీట్లు వస్తాయని అంచనా వేసినప్పటికీ, బీహార్ ఎన్నికల తర్వాత స్వల్ప మార్పు కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ, బెంగాల్‌లో టీఎంసీ ఆధిక్యానికి ఇప్పటికీ గణనీయమైన ప్రమాదం లేదని సర్వే స్పష్టం చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870