సూపర్ స్టార్ మహేష్ బాబు, అన్న రమేష్ బాబు, కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ (Ghattamaneni Jayakrishna) హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram). ఈ క్రేజీ ప్రాజెక్టును RX 100, మంగళవారం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన కల్ట్ దర్శకుడు అజయ్ భూపతి, తెరకెక్కించనున్నాడు.ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ రాషా తడాని, హీరోయిన్ గా నటిస్తోంది.
Read Also: Om Shanti Shanti Shantihi Movie Review: ఓ శాంతి శాంతి శాంతిః మూవీ ఎలా ఉందంటే!
తెలుగులో ఫస్ట్ సినిమా
ఈ చిత్రాన్ని చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్(P. Kiran) నిర్మిస్తుండగా.. అశ్వనీదత్, సమర్పిస్తున్నాడు. జీవీ ప్రకాష్ (GV Prakash) సంగీతం అందిస్తున్నాడు. ఈ సందర్బంగా, ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్గా ఉన్న రషా థడానీ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ లుక్‌లో ఆమె పాత్రకు సంబంధించిన ప్రత్యేక యాంగిల్, స్టయిల్, లుక్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈమె ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె కాగా, తెలుగులో ఫస్ట్ సినిమా కావాడం విశేషం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: