हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

AP: రైతులకు ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ తప్పనిసరి.. లేకపోతే ఇబ్బందే!

Saritha
AP: రైతులకు ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ తప్పనిసరి.. లేకపోతే ఇబ్బందే!

ఆంధ్రప్రదేశ్ (AP) రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అన్నదాత సుఖీభవ, పంటల బీమా రాయితీపై పరికరాలు, డ్రోన్లు, గోకులాలు, సబ్సిడీపై విత్తనాలు, ఇలా ఎన్నో పథకాలు అమలవుతున్నాయి. అయితే ఈ పథకాలు రైతులకు అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాతలు ఫార్మర్‌ రిజిస్ట్రీ నమోదు చేయించుకోవాలని సూచిస్తోంది. 11 అంకెల యూనిక్ ఐడీతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు అధికారులు. ‘ఫార్మర్‌ రిజిస్ట్రీ’ నమోదు ద్వారా రైతులకు ప్రభుత్వ పథకాలు సులభంగా అమలు చేయొచ్చు. భవిష్యత్తులో కేంద్రం ప్రవేశపెట్టే ఏ పథకానికైనా ఈ ఫార్మర్‌ రిజిస్ట్రీ తప్పనిసరి అంటున్నారు. 

Read Also: AP Crime: ఆత్మహత్యకు పాల్పడ్డ గ్రామ సచివాలయ ఉద్యోగి

AP: రైతులకు 'ఫార్మర్ రిజిస్ట్రీ' తప్పనిసరి.. లేకపోతే ఇబ్బందే!

గ్రామ సేవా కేంద్రాల్లో సులభ నమోదు ప్రక్రియ

(AP) భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలన్నీ ఈ ‘ఫార్మర్‌ రిజిస్ట్రీ’ ఆధారంగానే అమలు అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు ఇదే ప్రామాణికంగా మారే అవకాశం ఉందని.. దీని ద్వారా పీఎం కిసాన్ (PM Kisan) నిధులు కూడా నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. రైతులు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. 

గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో వీవీఏలు ఈ నమోదు ప్రక్రియను ఏడాదిగా నిర్వహిస్తున్నారు. ఈ నమోదు ప్రక్రియ కోసం రైతులు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. తమ ఆధార్ కార్డు, భూమి పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబరుతో రైతు సేవా కేంద్రాన్ని సంప్రదిస్తే సరిపోతుంది. అక్కడి సిబ్బంది మీ వివరాలను నమోదు చేసి, మీకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య (యూనిక్ ఐడీ)ను అందిస్తారు. ఈ సంఖ్య మీ మొబైల్‌కు మెసేజ్ రూపంలో వస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870