Cyber crime: స్మార్ట్‌ఫోన్ వాడకం పెరిగిన కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. సామాన్యులను బురిడీ కొట్టించేందుకు ఏకంగా దేశంలోని అగ్రశ్రేణి నాయకుల ముఖాలను, గొంతులను వాడుకుంటూ డీప్‌ఫేక్ (Deepfake) టెక్నాలజీతో నకిలీ వీడియోలను సృష్టిస్తున్నారు.
Read Also: TG Crime: తల్లి మందలించిందన్న మనస్తాపంతో.. యువతి ఆత్మహత్య

ఏమిటా నకిలీ వీడియోలు?
ఇటీవల సోషల్ మీడియాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
- పెట్టుబడి మోసం: రూ. 22 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. రూ. 20 లక్షల లాభం వస్తుందని, ఇది కేంద్ర ప్రభుత్వ అధికారిక యాప్ అని నిర్మలా సీతారామన్ చెబుతున్నట్లుగా ఈ వీడియోలను రూపొందించారు.
- మోసం చేసే పద్ధతి: ఏఐ (AI) సాయంతో వారి గొంతును, హావభావాలను మార్చేసి, అది నిజమైన వీడియోనే అని నమ్మేలా కేటుగాళ్లు ప్లాన్ చేశారు.
నిపుణుల హెచ్చరిక:
ఇలాంటి వీడియోలు చూసి ఆకర్షితులై డబ్బులు పెట్టుబడి పెడితే క్షణాల్లో బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయని సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ ప్రభుత్వ సంస్థ లేదా నాయకులు ఇలాంటి భారీ లాభాల ఆశ చూపే స్కీములను సోషల్ మీడియా వీడియోల ద్వారా ప్రచారం చేయరని గుర్తుంచుకోవాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: