బస్సులు, కారుల్లో ప్రయాణించేటప్పుడు చేతులు, తలలు బయటకు పెట్ట వద్దని పెద్దలు ఎన్ని సార్లు చెప్పినా కొందరు వినిపించుకోరు. దీంతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. (AP News) తాజాగా ఓ బస్సు కిటీకీ సీటులో కూర్చున్న ఓ ఇంటర్ విద్యార్ధి (Intermediate student) అనుకోని విధంగా దుర్మరణం చెందాడు. కిటికీ సీటు వద్ద కూర్చున్న విద్యార్ధి తల బయటకు పెట్టాడు. కాసేపటికే దారుణం చోటు చేసుకుంది.
Read Also: TTD: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనం 8 గంటలు

ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టోల్గేట్ వద్ద బుధవారం చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అన్నంపల్లి టోల్గేట్ వద్ద ఆర్టీసీ బస్ లో ఈ రోజు ఉదయం ప్రయాణికులతో వెళ్తుంది. (AP News) ఇందులో కాలేజీలు, బడులు, ఉద్యోగ వ్యాపారాలకు వెళ్తే రకరకాల ప్రయాణికులు ఉన్నారు. అయితే బస్సు టోల్ గేట్ వద్ద బస్ వెల్లుతుండగా ఆర్టీసీ బస్ కిటికీలో నుంచి ఓ ఇంటర్ విద్యార్థి తల బయటకు పెట్టాడు. అక్కడ కొద్ది సేపు ఆగిన బస్సు ఆ వెంటనే బయల్దేరింది. ఈ క్రమంలో బస్సు ముందుకు కదలడంతో టోల్ గేట్ కేబిన్ రాడ్ విద్యార్ధి తలకు బలంగా తగిలింది. దీంతో తీవ్ర గాయాల పాలైన విద్యార్ధిని 108 అంబులెన్స్ లో హుటాహుటీన అమలాపురం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అంబులెన్స్ లో తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే విద్యార్ధి మృతి చెందాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: