Baramati plane crash: మహారాష్ట్రలోని బారామతి విమానాశ్రయం సమీపంలో చోటుచేసుకున్న విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం కారణంగా కూలిపోయిన లియర్‌జెట్ 45 విమానం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన బ్లాక్‌బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానం కూలిపోవడానికి గల అసలు కారణాలను బ్లాక్‌బాక్స్ వెల్లడించనుందని అధికారులు భావిస్తున్నారు.
Read Also: Ajit Pawar Death: అజిత్ పవార్ సహా ఆరుగురు దుర్మరణం
ఈ దుర్ఘటనలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ముంబై నుంచి బయలుదేరిన ఈ ప్రైవేట్ లియర్‌జెట్, బారామతి విమానాశ్రయానికి చేరువయ్యే సమయంలో నియంత్రణ కోల్పోయి ఒక పొలంలోకి దూసుకెళ్లి కూలిపోయింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో విమానం పూర్తిగా ధ్వంసమైంది.
సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే అప్పటికే ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదం దేశ రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తును ముమ్మరం చేసింది. విమానం ల్యాండింగ్ సమయంలో ఎదురైన సాంకేతిక సమస్యలు, వాతావరణ పరిస్థితులు, పైలట్ నిర్ణయాలు వంటి అంశాలపై సమగ్ర విచారణ చేపట్టినట్లు డీజీసీఏ తెలిపింది. బ్లాక్‌బాక్స్ డేటా ఆధారంగా పూర్తి నిజాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: