ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Govt Jobs) విడుదలైంది. ముంబయి రీజియన్‌కు చెందిన ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ (Pr.CCIT) ఈ నోటిఫికేషన్‌ను ప్రకటించగా, మొత్తం 97 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమై,జనవరి 31, 2026 చివరి తేదీగా నిర్ణయించారు.
Read Also:AP: త్వరలో DSC నోటిఫికేషన్: మంత్రి సవిత

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు
ఈ నోటిఫికేషన్‌లో కింది పోస్టులు ఉన్నాయి:
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్–2 : 12 పోస్టులు
- ట్యాక్స్ అసిస్టెంట్ : 47 పోస్టులు
- మల్టీ–టాస్కింగ్ స్టాఫ్ (MTS) : 38 పోస్టులు
విద్యార్హత & క్రీడా అర్హతలు
అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ(Govt Jobs) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్, లాన్ టెన్నిస్, క్రికెట్, బాస్కెట్ బాల్, వాలీబాల్, కబడ్డీ, ఫుట్‌బాల్, బిలియర్డ్స్ వంటి క్రీడల్లో ప్రాతినిధ్యం వహించిన సర్టిఫికెట్లు ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ప్రతి అభ్యర్థి దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించాలి.
ఎంపిక విధానం & జీతభత్యాలు
ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల క్రీడా ప్రతిభ ఆధారంగానే తుది ఎంపిక జరుగుతుంది.
ఎంపికైన వారికి:
- స్టెనోగ్రాఫర్ & ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు
- MTS పోస్టులకు నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు జీతం చెల్లిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: