
Warangal road accident: తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం హృదయ విదారకంగా మారింది. ఈ ప్రమాదంలో 9 నెలల గర్భిణిగా ఉన్న వైద్యురాలు డాక్టర్ ఎస్. మమతారాణి ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లి గ్రామానికి చెందిన మమతారాణి, వరంగల్ హంటర్ రోడ్డులోని ఫాదర్ కొలంబో ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్ విభాగంలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు.
Read Also: TG Crime: తల్లి మందలించిందన్న మనస్తాపంతో.. యువతి ఆత్మహత్య
సోమవారం రాత్రి విధులు ముగించుకుని భర్త డాక్టర్ రాఘవేంద్రతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. మార్గమధ్యంలో ఓ టిప్పర్ లారీ బైక్‌ను ఢీకొట్టడంతో తీవ్ర ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మమతారాణి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించినా, చికిత్స పొందుతూ మృతి చెందారు.
Warangal road accident: Pregnant woman dies in road accident: CCTV footage
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, సహచర వైద్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తల్లిగా మారాల్సిన సమయంలోనే ఆమె ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరిని కలచివేసింది. ఇదిలా ఉండగా, ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడం సంచలనం రేపుతోంది. ఫుటేజ్‌లో టిప్పర్ నిర్లక్ష్యంగా నడిపినట్లు కనిపిస్తోందని తెలుస్తోంది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమా? ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన మరోసారి రోడ్డు భద్రత, భారీ వాహనాల నియంత్రణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: