AR Rahman : ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ చేసిన తాజా వ్యాఖ్యలపై నటుడు ముఖేష్ రిషి స్పందించారు. దేవుడు ఎంతో గొప్ప స్థానం, గుర్తింపు ఇచ్చిన తర్వాత కూడా పని గురించి ఫిర్యాదు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీలో అవకాశాలు రావడం–రాకపోవడం సహజమేనని అన్నారు.
ఐఏఎన్ఎస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖేష్ రిషి మాట్లాడుతూ, “దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు నాకు అవకాశాలు రావడం లేదని చెప్పడం భావ్యం కాదు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఒకే నియమాలు ఉంటాయి” అని వ్యాఖ్యానించారు. ప్రతిభ ఉన్నా కొన్నిసార్లు అవకాశాలు దక్కకపోవచ్చని, అది సహజ ప్రక్రియేనని తెలిపారు.
Read Also: KCR phone tapping: ట్యాపింగ్ కేసులో కేసీఆర్ నోటీసులు?
రహమాన్ గత రెండు దశాబ్దాలుగా (AR Rahman) పరిశ్రమలో కొనసాగుతూ ఎన్నో హిట్ పాటలు అందించారని గుర్తు చేశారు. ఆయన సంగీతాన్ని ప్రేక్షకులు ఎంతో ఆదరించారని, అందుకే ఈ విషయాలను కూడా ఆయన అర్థం చేసుకోవాలని సూచించారు.

ఇటీవల బీబీసీ ఏషియన్ నెట్వర్క్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, బాలీవుడ్లో తనకు అవకాశాలు తగ్గడానికి మతతత్వం కూడా ఒక కారణం కావచ్చని రహమాన్ వ్యాఖ్యానించడంతో ఈ చర్చ మొదలైంది. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో, రహమాన్ సోషల్ మీడియా ద్వారా క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: