हिन्दी | Epaper
ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌

Alaguraja encounter : కరడుగట్టిన అళగురాజా ఎన్‌కౌంటర్! అక్కడ ఏం జరిగింది?

Sai Kiran
Alaguraja encounter : కరడుగట్టిన అళగురాజా ఎన్‌కౌంటర్! అక్కడ ఏం జరిగింది?

Alaguraja encounter : తమిళనాడులో మరోసారి పోలీస్ ఎన్‌కౌంటర్ సంచలనం రేపింది. పెరంబలూరు జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో కరడుగట్టిన నేరస్తుడు అళగురాజా మృతి చెందాడు. ఆయుధాల రికవరీ కోసం తీసుకెళ్లిన సమయంలో పోలీసులపై దాడికి యత్నించడంతో, ఆత్మరక్షణలో కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో తలకు బుల్లెట్ తగలడంతో అళగురాజా అక్కడికక్కడే మరణించాడు.

అళగురాజాపై హత్యలు, దోపిడీలు, బెదిరింపులు, కాంట్రాక్ట్ కిల్లింగ్స్ సహా 30కి పైగా కేసులు నమోదై ఉన్నాయి. అత్యంత ప్రమాదకర నేరగాడిగా పేరున్న ఇతను, కొన్నేళ్లుగా జిల్లాలు మారుతూ పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. ఇటీవల మరో నేరగాడు కాళిముత్తుపై జరిగిన దాడి కేసులో అళగురాజా కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది.

Read Also:Telangana: ఫ్లాగ్ హోస్టింగ్ సమయంలో అపశృతి

Alaguraja encounter
Alaguraja encounter

నిఘా సమాచారం మేరకు, ప్రత్యేక బృందం (Alaguraja encounter) ఆదివారం రాత్రి ఊటీలో అళగురాజాతో పాటు అతని అనుచరులను అదుపులోకి తీసుకుంది. అనంతరం దాచిపెట్టిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకునేందుకు పెరంబలూరు జిల్లా తిరుమంతురై సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ కొడవలితో పోలీసులపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారికి గాయాలవగా, అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. అళగురాజా మృతితో పెద్ద క్రిమినల్ నెట్‌వర్క్‌కు గట్టి దెబ్బ తగిలిందని అధికారులు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870