ప్రపంచానికి భూతాపం, వాతావరణ ప్రతాపాల కారణంగా ముప్పువాటిల్లుతుందని శాస్త్రజ్ఞులు చెప్తున్న హెచ్చరికల్లో ఎంతో నిజం ఉందనడానికి గత పదేళ్లుగా తీవ్రమవుతున్న ప్రకృతి ప్రకోపాలే సాక్ష్యం. గాలి, నీరు, భూమి, కాలుష్యం వేగంగా కరు గుతున్న హిమనీనదాలతో భూగోళం ప్రమాదం అంచుకు నెట్టబడుతోంది. ఒకటికాదు, రెండు కాదు లెక్కకు మించిన ఎన్నో ప్రకృతివిలయాలను భారతదేశం చూస్తోంది. ప్రపం చం కూడా ఈ విలయ విధ్వంసాలకు వేదికగా మారింది. ఎన్నడూ లేనట్లుగా కరువుకాటకాలు, హిమపాతం, తుఫాన్లు, టోర్నడోలు వంటి ప్రకృతి ప్రకోపాలకు ఎంతగానే ధన ప్రాణ, మాన నష్టం సంభవించింది. ఒకపక్క చలి గాలుత ప్రతాపం, మరోపక్క మండే ఎండలు ఈ భారత దేశం వెంటవెంటనే చవిచూసింది. అవన్నీ కాలం కాని కాలంలో వచ్చినవే. ప్రపంచంలో వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. 2025లో వాతావరణ పరిస్థితులు విచిత్రంగా గోచరించాయి. ఎప్పుడు వానలు పడతాయో ఎప్పుడు ఎండలుంటాయో తెలియనిపరిస్థితి కనిపించింది. ఏక మొత్తంగా చెప్పాలంటే వాతావరణ విధ్వంసం వల్లనే హిమపాతాలూ వేడిగాలులు వీస్తున్నాయి. ఈ తుఫానుకు ఆర్కిటిక్ బ్లాస్ట్ వల్ల ఉత్తరధృవం నుంచి వచ్చే అతిశీతల గాలులే కారణమని వివరిస్తోంది. వాతవరణ శాఖ తాజాగా అమెరికాలోనే కాదు అఫ్ఘానిస్థాన్, కశ్మీర్ ప్రాంతాల్లో కూడా మంచు బాగా కురుస్తోంది. అమెరికాలోని ఎన్నో ప్రాంతా లు భారీ హిమపాతం, వర్షపాతం, అతిశీతల వాతావరణంతో వణికిపోతున్నాయి. దాదాపు అన్ని నగరాల్లో ఆరుబయట ప్రదేశాల్లో అరడుగుల మేరకు మంచు పేరు కునిపోయింది. ఆ దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, అన్నిప్రదేశాల్లోనూ భీకర స్థాయిలో మంచు కురుస్తోంది. ఇలాంటి సందర్భాలను ‘మంచు తుపాను’గా వర్ణిస్తాయి. దీనివలన 20 కోట్ల మందికిపైగా జనంపై ప్రభావితం చూపిస్తోంది. 18 రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. ఇళ్లల్లో నుంచి మనుషులు బయటకు రాలేని పరిస్థితి ఉంది. నిత్యావసర వస్తువుల కోసం కూడా బయటకులేకపోతున్నారు. చాలా రాష్ట్రాల్లో రవాణా సేవలు నిలిచిపోయాయి. దాదాపు పదివేలకుపైగా విమాన సర్వీసులను అననుకూల పరిస్థితుల రీత్యా రద్దు చేశారు. విద్యా లయాలకు తప్పనిసరిగా సెలవులు ప్రకటించారు. మరో 3,4 రోజులు జనావాసాల పైన కూడా మంచు పేరుకు పోయే అవకాశముందని వాతావరణ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అతి శీతలగాలుల వలన అమెరికాలు చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. ఈ సీజన్లో ఇదే పెద్ద మంచు తుఫాన్.ఈ దశాబ్దానికే ఇది అతి భారీ మంచుతుఫాన్గా (Blizzard) నమోదయ్యే పరిస్థితి ఉంది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 20 నుంచి మైనస్ 40దాకా పడిపోతున్నాయి. అత్యవసర సేవలు అందించ లేనిపరిస్థితుల్లో జనజీవనం మందకొడిగా ఉంది. జార్జియా లో గత దశాబ్దకాలంలో అతిశీతల మంచు తుఫాన్ (Blizzard)ఇదేనని భావిస్తున్నారు. జనం విపరీతమైన చలికి తట్టుకోలేక పోతున్నారు. స్వెట్టర్లు కూడా వారిని అతిశీతల ప్రభా వం నుంచి రక్షించలేకపోతున్నాయి. అమెరికాలో దాదాపు లక్ష ప్రాంతాలకుపైగా కరెంట్ కోతలు విధించాల్సి వచ్చింది. టెక్సాస్ నగరం మొత్తం చీకటిలో మునిగిపోయింది. టెక్సాస్‌లో ఐదేళ్లనాడు తుఫాను సమయంలో భారీ కంరెటు కోతలు జరిగిన సందర్భంగా వందలాది మంది మరణించిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుని ఈసారి పలుజాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈసారి ఒక్కమరణం కూడా సంభవించని విధంగా పాలనా యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. మంచు బీభత్సం బాగా పెరిగే అవకాశ మున్న జార్జియా, మిసిసిపి రాష్ట్రాలలో అత్యయికస్థితిని ప్రభుత్వం ప్రకటించింది. దానాదీనా ప్రాథమిక అంచనా లో దాదాపు 16 కోట్లమంది మంచు తుఫాను బాధితులు గా ప్రభుత్వం ప్రకటించింది. నైరుతి ప్రాంతంలో న్యూ మెక్సికో నుంచి ఈశా న్యంలోని న్యూ ఇంగ్లాండ్ వరకు భారీ మంచు తుఫాను బారినపడిన వారే. ఇటు భారత దేశంలోనూ హిమపాతాలు వణికిస్తున్నాయి. పక్షం రోజు ల్నాడే కశ్మీరును మంచుదుప్పటి కప్పేసిందన్న సమాచా రం వచ్చింది. కాస్త తెరపిన పడ్డా మనుకున్నతరుణంలో హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో భారీ హిమపాతం నమో దైంది. వారాంతపు సెలవులరీత్యా మనాలి జాతీయ రహ దారిపై కిలోమీటర్ల కొద్దీ రహదారి ట్రాఫిక్ స్తంభించిపోయింది. పర్యాటకుల తాకిడి బాగా ఎక్కువైంది. గడ్డకట్టే చలిలో యాత్రికులు ఆరోగ్యపరంగా ఇబ్బందిపడ్డారు. దాదాపు ఈ సీజన్లో లో మూడునెలల తర్వాత తొలిసారిగా భారీ హిమపాతం నమోదైంది. ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడికక్కడ ఆహారం, నీరువంటి సదుపాయాలు కలిగిం చడంలో ఎంతో కష్టతరంగా ఉంది. ఎంతోమంది పర్యాట కులు మార్గమధ్యంలోనే ట్రాఫిక్ చిక్కుకుపోవడంలో హోటళ్ల ఆక్యుపెన్సీ కూడా బాగా తగ్గిపోయింది. హిమపా
తంతో 685 రోడ్లు ఎక్కడికక్కడ మూసుకుపోయాయి. మంచుగడ్డ కట్టిన ప్రతి చోటా విద్యుత్ అంతరాయం నిలిపి వేశారు. ఇలా మంచుతుఫానులు ఏర్పడినప్పుడు అది కరిగేందుకు చాలా సమయం తీసుకుంటుంది. పెద్ద పెద్ద నగరాల్లో ఉష్ణోగ్రతలు 30నుంచి 40 డిగ్రీలకు పడి పోయాయి. మంచుతుఫాను హెచ్చరికలు వచ్చినప్పుడు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుంటే ఎంతో భద్రతగా ఉన్నట్లే. రేపోచ్చే ఎల్సినో, లానినోల ప్రభావం దుష్పలి తాలను ఇవ్వకుండా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత ప్రజలదే. ప్రకృతిని నిందిస్తూ కూర్చోలేం. Iకనుక వైపరీత్యాల నుంచి అప్రమత్తంగా గట్టేక్కేయడమే మానవ ధర్మం!
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: