భాగ్యనగర వాసులకు పౌర సేవలను మరింత చేరువ చేసే దిశగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కీలక అడుగు వేసింది. నగర విస్తరణ, పరిపాలన సౌలభ్యం కోసం ఇటీవల చేపట్టిన సంస్కరణలకు అనుగుణంగా (TG) జనన, మరణాల నమోదు వ్యవస్థను ఆధునీకరించింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో రూపొందించిన సరికొత్త సాఫ్ట్వేర్ అప్లికేషన్‌ను అధికారులు అధికారికంగా ప్రారంభించారు.
Read Also: GHMC Divisions: హైదరాబాద్‌లో ఇళ్లు కొనేవారికి కొత్త సమస్య..

సాంకేతిక ఇబ్బందులను నివారించేందుకు ముందస్తు మ్యాపింగ్
భారీ స్థాయిలో జరిగిన భౌగోళిక మార్పుల వల్ల పాత నమోదు వ్యవస్థలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తుగా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. (TG) నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లను కొత్తగా ఏర్పడిన 300 వార్డులు మరియు 60 సర్కిళ్లతో అనుసంధానించారు. దీనివల్ల ఏ ప్రాంతంలో జననం లేదా మరణం సంభవించినా అది తక్షణమే సంబంధిత వార్డు పరిధిలోకి ఆటోమేటిక్‌గా నమోదవుతుంది. గతంలో ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కొత్త వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
జననం లేదా మరణం సంభవించిన 21 రోజులలోపు ఆసుపత్రి యాజమాన్యం లేదా కుటుంబ సభ్యులు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ గడువు దాటితే.. నిర్ణీత జరిమానాతో పాటు రెవెన్యూ అధికారుల అనుమతి అవసరమవుతుంది. కొత్త సాఫ్ట్వేర్ రాకతో పేరు , అడ్రస్‌లో మార్పులు కూడా గతంలో కంటే త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: