అధిక రక్తపోటుతో బాధపడే వారు భోజన(Health Tips) సమయాన్ని పాటించడమే కాకుండా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ఆహార పదార్థాలు రక్తపోటు సమస్యను మరింత పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు.

రక్తపోటును పెంచే ఆహారాలు ఇవే
కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తరచూ సేవించడం(Health Tips) వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. అలాగే పిజ్జా, బర్గర్ వంటి ఫాస్ట్ ఫుడ్స్‌లో అధికంగా ఉండే సోడియం రక్తనాళాలపై ప్రతికూల ప్రభావం చూపి బీపీ పెరగడానికి కారణమవుతుంది. ప్రాసెస్ చేసిన మాంసాహారాల్లో ఉండే సోడియం, నైట్రేట్లు అధిక రక్తపోటుకు దారి తీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ఎక్కువ రోజులు నిల్వ ఉంచే పచ్చళ్లు కూడా బీపీని పెంచే అవకాశం ఉన్నట్లు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: