हिन्दी | Epaper
కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం

Gold rate Hyderabad : బంగారం చుక్కలు చూపిస్తోంది! వెండి ఒక్కరోజే రూ.10 వేలు?

Sai Kiran
Gold rate Hyderabad : బంగారం చుక్కలు చూపిస్తోంది! వెండి ఒక్కరోజే రూ.10 వేలు?

Gold rate Hyderabad : బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల ప్రభావంతో పసిడి మరోసారి కొత్త గరిష్ఠాన్ని తాకగా, వెండి ఒక్కరోజులోనే ఏకంగా రూ.10 వేల జంప్ చేసింది. గ్లోబల్ మార్కెట్‌లో పెరిగిన ధరల ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా తీసుకుంటున్న వాణిజ్య నిర్ణయాలు, వివిధ దేశాలపై విధిస్తున్న సుంకాలు పెట్టుబడిదారులను కలవరపెడుతున్నాయి. దీంతో భద్రమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా పసిడి ధరలు సామాన్యులకు అందని స్థాయికి చేరుతున్నాయి.

Read Also: Hyderabad: ఫర్నిచర్ దుకాణంలో ఘోర అగ్ని ప్రమాదం.. 5 మంది మృతి

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు సుమారు 38 డాలర్లు పెరిగి 5,027 డాలర్ల స్థాయికి చేరింది. అదే సమయంలో స్పాట్ సిల్వర్ ధర 3.5 శాతం కంటే ఎక్కువగా పెరిగి ఔన్సుకు 107 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

Gold rate Hyderabad
Gold rate Hyderabad

హైదరాబాద్ మార్కెట్లో జనవరి 27న బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,61,950గా నమోదుకాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,450కు చేరింది. వెండి ధర అయితే మరింత ఆశ్చర్యపరిచింది. ఒక్కరోజులోనే రూ.10 వేలు పెరిగి కిలో వెండి రూ.3,75,000కు చేరుకుని సరికొత్త రికార్డును నెలకొల్పింది.

ఈ ధరలు ఉదయం 7 గంటల సమయంలో నమోదైనవని, బులియన్ మార్కెట్లో రోజంతా ధరలు మారే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్ రేట్లు తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870