SIT notice BRS : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు Santosh Rao కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. రేపు (జనవరి 27) మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.
ఇదివరకే ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ K. T. Rama Rao, సీనియర్ నేత Harish Rao లను సిట్ అధికారులు విచారించారు. ఇప్పుడు సంతోష్ రావుకు నోటీసులు ఇవ్వడంతో కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Also:Telangana: ఫ్లాగ్ హోస్టింగ్ సమయంలో అపశృతి

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య రాజకీయ వేడి కొనసాగుతోంది. కీలక నేతల విచారణలతో ఈ కేసు ఎటువంటి మలుపు తిరుగుతుందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: