Digital Crime India: సైబర్ నేరగాళ్లు అక్రమ మార్గాల్లో డబ్బును దోచుకోవడానికి అనేక విధానాలను అన్వేషిస్తారు. అందులో ప్రధానమైనది డిజిటల్ అరెస్ట్. కేవలం ఎదుటివారిని బెదిరించడం ద్వారా వారి నుంచి డబ్బును సాధ్యమైనంత వరకు దోపిడీ చేయడమే వీరి లక్ష్యం. సైబర్ నేరాలు ఏ రకానికి చెందినప్పటికీ వాటికి గురై మోసపోతున్నామంటే కేవలం బాధితుల ఆలోచనల్లో తప్పిదాలే అని చెప్పవచ్చు. ఎవరో ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ చేస్తామని చెప్పడంతో బెదిరిపోవడం, మరొకరు బ్యాంక్ అకౌంట్లు, ఓటిపీలు చెప్పాలని కోరడంతో వారికి ఆయా వివరాలు ఇవ్వడం వంటివి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. స్టాక్ఎక్చేంజిలో డబ్బు పెడితే పది రెట్లు ఇస్తామని చెప్పడంతో మరికొందరు ఈ మోసాలకు బలి అవుతున్నారు. అసలు అది సాధ్యమేనా అని కొంతైనా ఆలోచన చేయకుండా మోసపోతున్నారు.
Read Also: New Year life planning: కొత్త సంవత్సరంలో కొంగొత్త ఆశలు

ముందుగా సైబర్నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డిజిటల్ అరెస్ట్ గురించి పరిశీలిస్తే అసలు అలాంటి ప్రక్రియ పోలీసు విభాగంలో లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు శాఖలోని వివిధ విభాగాల అధిపతులు, సైబర్ నిపుణులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్ రాగానే భయపడి లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు వారికి ముట్టజెబుతున్నారు. మీ ఆధార్ నెంబరు నుంచో, బ్యాంక్ అకౌంట్ నుంచో అక్రమ లావాదేవీలు జరిగాయని సైబర్నేరగాళ్లు ఫోన్ చేయగానే నిజమని నమ్ముతున్నారు.
తాము అలాంటివి చేయలేదని ఆధారాలు చూపించాలని అడగాల్సిన బాధ్యత బాధితులపై ఉంది. అంతేకాకుండా విదేశాల నుంచి తమ పేరుపై ఒక పార్శిల్ వచ్చిందని, అందులో కోట్ల రూపాయల డ్రగ్స్ ఉన్నాయని సైబర్నేరగాళ్లు చెబుతారు. తమకు ఈ లావాదేవీలతో సంబంధం లేదని, విచారణకు ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇస్తానని చెప్పే కనీస జ్ఞానాన్ని కోల్పోతున్నారు. దీనితో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఒకసారి గత మూడేళ్లుగా జరిగిన డిజిటల్ అరెస్ట్లను పరిశీలిస్తే ఎంత పెద్ద సంఖ్యలో మోసపోతున్నారన్న విషయం అర్థమవుతుంది.

Digital Crime India: Digital arrests on the rise in the country
2022లో 39,925 కేసులు నమోదు అయ్యాయి. సైబర్ నేరగాళ్లు బాధితుల నుంచి 91.14 కోట్ల రూపాయలు కాజేశారు. 2023లో సుమారు 500 కోట్లు సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు, మొత్తం సైబర్ క్రైమ్ ລ້ 86,4205 . 202455 1,23,672 కేసులు నమోదు కాగా సుమారు 1,935.51 కోట్ల రూపాయలు నేరగాళ్లు వసూలు చేశారు. ఈ సంఖ్య ప్రతి రోజూ పెరుగుతూనే ఉంది. అసలు డిజిటల్ అరెస్ట్ అన్న పదం, ప్రక్రియ భారత నేరస్మృతి చట్టంలో లేదని చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇది సైబర్నేరగాళ్లకు వరంగా మారింది. దీనితో దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ తరహా సైబర్ నేరాలను లోతుగా దర్యాప్తు చేసేందుకు వివిధ దర్యాప్తు సంస్థల ప్రతినిధులతో కూడిన ఒక ఉన్నత స్థాయి మల్టీ ఏజెన్సీ ప్యానెల్ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ జరగడానికి కొన్ని రోజుల ముందే కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీకి స్పెషల్ సెక్రటరీ అధ్యక్షత వహించనున్నారు.
ఈ కమిటీలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA). ఢిల్లీ పోలీసు విభాగాలకు చెందిన ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు.
వీరితో పాటు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్, విదేశీ వ్యవహారాలు, ఫైనాన్స్, లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖల నుండి జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు, భారతీయ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(14C) సభ్యులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతినిధులు కూడా ఇందులో భాగస్వామ్యం వహిస్తారు. అదేవిధంగా డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు ఉచ్చు బిగించిన వెంటనే బాధితులు పోలీసులను ఆశ్రయించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని కమిటీలు వేసినా అవి నష్టం జరిగిన తరువాతే రంగంలోకి దిగుతాయి. ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా చూసుకోవడమే ఉత్తమం. తప్పు చేసి పోలీసుల చుట్టూ తిరిగి న్యాయం చేయాలని కోరడం కంటే ఇలాంటి డిజిటల్ అరెస్ట్లు అనే ప్రక్రియ దేశంలో అమలులేదన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలి.
డాక్టర్ గిరీష్ కుమార్ సంఘీ
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: