- జీరో ఫెల్లింగ్ దిశగా టాస్క్ ఫోర్స్
- 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ కార్య్యాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవ(RepublicDay) వేడుకలు ఘనంగా జరిగాయి. టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ.శ్రీనివాస్ త్రివర్ణ పతాకాన్నిఎగుర వేసి, గౌరవ వందనం చేశారు. ఆయనతో పాటు ఎఎస్పీ జె. కులశేఖర్, డీఎస్పీలు ఎండీ షరీఫ్, వీ. శ్రీనివాస రెడ్డి, ఎసీఎఫ్ జె. శ్రీనివాస్ జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. తరువాత ఎస్పీ మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయని, దీనికి టాస్క్ ఫోర్స్ లో(RepublicDay) ప్రతి ఒక్కరి శ్రమ ఉందని తెలిపారు. టాస్క్ ఫోర్స్ లక్ష్యం శేషాచలంలో జీరో ఫెల్లింగ్ కాగా, ఆ దిశగా పని చేయాలని సూచించారు. ఈ ఏడాది మరింత సమర్థవంతంగా పని చేయాలని ఆశించారు. కార్యక్రమంలొ కానిస్టేబుల్ ఎన్.నారాయణకు ఉత్ర్కుష్ట సేవా పతకాన్ని అందజేశారు. ఇంకా పలువురు సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ సాయి గిరిధర్, సీఐ ఖాదర్ బాషా, ఎస్ఐ ఎండీ రఫీ, ఆర్ఎస్ఐలు లింగాధర్, వినోద్ కుమార్, విష్ణువర్ధన్, మురళీధర్ రెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: