జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ డిప్యూటీ స్పీకర్ జిల్లా బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు యం . పద్మ దేవేందర్ రెడ్డి. మెదక్ జిల్లా(Medak) కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు యం. పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్,మెదక్ పట్టణ నాయకులతో కలిసి గాంధీ, బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
Read Also:Telangana: ఫ్లాగ్ హోస్టింగ్ సమయంలో అపశృతి

ఈ సందర్బంగా పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మెదక్ జిల్లా ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.స్వతంత్ర ఉద్యమంలో మహనీయుల సేవలను,ప్రాణత్యాగాలను కొనియాడారు. స్వతంత్ర సమరయోధులను స్మరించుకొని వారి ఆదర్శాలకు పునరాంకితం కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగంలోని విలువలు హక్కుల పోరాటం కోసం పాటుపడాలన్నారు.ఈ కార్యక్రమంలో(Medak) మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్,మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు యం.లావణ్య రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు బట్టి.జగపతి కృష్ణారెడ్డి,పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు,కో కన్వీనర్లు కృష్ణ గౌడ్,లింగారెడ్డి జుబేర్ అహ్మద్,మాజీ కౌన్సిలర్లు ఆర్కే.శ్రీనివాస్,వంజరి.జయరాజ్ భీమరి.కిషోర్,సోహెల్, చంద్రకళ, జ్యోతి,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: