TG: నాగర్‌కర్నూల్ జిల్లా(NagarKurnool) ఊర్కొండ మండల పరిధిలోని ముచ్చర్లపల్లిలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న తమ బామ్మను పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చిన ముగ్గురు చిన్నారులు, సరదాగా నీటిలోకి దిగగా దురదృష్టవశాత్తు మునిగి ప్రాణాలు(Children Death) కోల్పోయారు.
Read also: Tirupati: చింతలచేను చిన్నారి కిడ్నాప్ కేసు ఛేదన.. ఆరుగురు అరెస్ట్

కుటుంబం మొత్తం శోకసంద్రంలో
గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి కుమారులు మరియు ఆయన మేనకోడలు ఈ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగింది. కొద్దిసేపటి క్రితం వరకు తనతో నవ్వుతూ ఆడుకున్న పిల్లలు ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేక శ్రీకాంత్‌రెడ్డి గుండెలు పగిలేలా విలపించాడు. ఈ ఘటన స్థానికులనూ తీవ్రంగా కలచివేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: