కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 131 పద్మ పురస్కారాలలో ఈసారి దక్షిణాది రాష్ట్రాల హవా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం అవార్డుల్లో 41 పురస్కారాలు దక్షిణ భారతదేశానికే దక్కడం విశేషం. రాష్ట్రాల వారీగా చూస్తే 15 అవార్డులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా, 13 అవార్డులతో తమిళనాడు రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తెలంగాణకు 7 పురస్కారాలు లభించగా, ఆంధ్రప్రదేశ్‌కు 4 అవార్డులు దక్కాయి. కర్ణాటకకు 8 పురస్కారాలు లభించాయి. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారిని గుర్తించే క్రమంలో దక్షిణాదికి ఈస్థాయిలో ప్రాధాన్యత లభించడం హర్షించదగ్గ పరిణామం.
Padma Sri Awards 2026: తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీలు అందుకున్న వారు వీరే
ఈ పురస్కారాల ఎంపికలో కేరళ రాష్ట్రం ప్రత్యేకతను చాటుకుంది. సంఖ్యాపరంగా కేరళకు 8 అవార్డులే వచ్చినప్పటికీ, అత్యున్నతమైన 5 పద్మ విభూషణ్ పురస్కారాలలో ముగ్గురు మలయాళీలే ఉండటం గమనార్హం. ఇది ఆ రాష్ట్రంలోని మేధోశక్తికి, కళాకారుల ప్రతిభకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. ఈ పరిణామాలపై బీజేపీ శ్రేణులు స్పందిస్తూ.. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి, అక్కడి ప్రతిభను గుర్తించడానికి పెద్దపీట వేస్తోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా సౌత్ ఇండియాకు ప్రాధాన్యత పెరిగిందని విశ్లేషిస్తున్నారు.

అయితే, ఈ పురస్కారాల వెనుక రాజకీయ కోణాలు కూడా ఉన్నాయనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది వేసవిలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు పెద్దపీట వేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో దక్షిణాది ఓటర్లను ఆకట్టుకోవడానికి కేంద్రం ఈ వ్యూహాన్ని అనుసరించి ఉండవచ్చని వారు గుర్తుచేస్తున్నారు. ఏదేమైనా, రాజకీయాలతో సంబంధం లేకుండా నిజమైన ప్రతిభావంతులకు ఈ గౌరవం దక్కడం ఆయా రంగాల్లోని వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com