టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కాంబినేషన్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇది నితిన్ కెరీర్ లో 36వ చిత్రం. #Nithin36 (Nithin36) అనే వర్కింగ్ టైటిల్ తో ఆసక్తికరమైన కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసారు. అంతేకాదు ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీ అని వెల్లడించారు. దీనికి ‘నో బాడీ.. నో రూల్స్’ అనే క్యాప్షన్ పెట్టారు.
Read Also: Patang Movie: ఓటీటీలోకి ‘పతంగ్’ ఎప్పుడంటే?
ఆసక్తికరమైన కాన్సెప్ట్ పోస్టర్ విడుదల
”ఇప్పటి వరకూ వినని కథ. ఎప్పుడూ అనుభూతి చెందని అనుభవం. నితిన్ & దర్శకుడు వీఐ ఆనంద్ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన సైన్స్ ఫిక్షన్ కథ రాబోతోంది. షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. #Nithin36 ((Nithin36)) – నో బాడీ. నో రూల్స్” అని చిత్ర బృందం పేర్కొంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.గుబురు గడ్డంతో ఉన్న నితిన్ సిగరెట్ తాగుతుండటం చూడొచ్చు.ఇంతకీ వీఐ ఆనంద్ నితిన్‌తో ఎలాంటి సబ్జెక్టును ప్లాన్ చేస్తున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్ ఎప్పటినుంచి మొదలవుతుందనే వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనుంది నితిన్ టీం. మరి నిఖిల్‌ను బ్రేక్ అందించిన వీఐ ఆనంద్ నితిన్‌కు కూడా మంచి సక్సెస్ అందించాలని మూవీ లవర్స్ ఆకాంక్షిస్తూ.. ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. నో బాడీ.. నో రూల్స్ క్యాప్షన్‌తో రాబోతున్న ఈ సినిమా ప్రీ లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: