మలయాళ మెగాస్టార్లు మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి నటిస్తున్న భారీ బహుభాషా చిత్రం ‘పేట్రియాట్’ (Patriotic) మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ముఖ దర్శకుడు మహేష్ నారాయణన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్ ‘కల్నల్ రహీమ్ నాయక్’గా, మమ్ముట్టి ‘డాక్టర్ డేనియల్ జేమ్స్’గా నటిస్తున్నారు.
Read Also: Pradeep Ranganathan: ప్రదీప్ కు జోడిగా శ్రీలీల?
భారీ అంచనాలు
వీరిద్దరూ కలిసి ఒక అక్రమ ఆపరేషన్‌ను ఎలా అడ్డుకున్నారనేది కథాంశం.ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, కుంచకో బోబన్, నయనతార (Nayanthara), రేవతి వంటి స్టార్స్ సైతం కీలక పాత్రలు పోషిస్తుండడం విశేషం. శ్రీలంక, లండన్, అబుదాబి, అజర్ బైజాన్, థాయ్‌లాండ్, విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ, కొచ్చి వంటి లొకేషన్స్‌లో 150 రోజులకు పైగా షూటింగ్ చేశారు.
ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న నయనతార (Nayanthara) ఫస్ట్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌పై ‘విభేదించడం కూడా దేశభక్తే’ (Dissent is patriotic) అనే క్యాప్షన్ ఉండటం ఆసక్తికరంగా మారింది. మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి దిగ్గజాలతో పాటు నయనతార కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సుషిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: