Nagari development : చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గాన్ని తన స్వంత నియోజకవర్గమైన కుప్పం తరహాలో అభివృద్ధి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu హామీ ఇచ్చారు. 2029 నాటికి నగరికి కృష్ణా జలాలను తీసుకువచ్చి సాగు, తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. ఉపాధి కోసం యువత వలస వెళ్లకుండా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
శనివారం నగరిలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, బహిరంగ సభలో ప్రసంగిస్తూ నగరితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేశారు. “నగరి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. నా మిత్రుడు, దివంగత నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనునిత్యం తపించేవారు. గత ఐదేళ్లలో అభివృద్ధి ఆగిపోయినా… ఇప్పుడు మళ్లీ మంచి రోజులు మొదలయ్యాయి” అని అన్నారు.
Read Also: Manoj Tiwary: కెప్టెన్ బాధ్యతలను రోహిత్ శర్మకు ఇవ్వాలి

పేదల అభ్యున్నతి కోసం చేపట్టిన పీ4 (పేదరికంపై గెలుపు) కార్యక్రమంలో (Nagari development) భాగంగా బంగారు కుటుంబాలకు మార్గదర్శకులుగా ముందుకొచ్చినవారిని సీఎం సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ‘స్వచ్ఛ రథాల’ను ప్రారంభించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రభుత్వానిదే కాక ప్రజల జీవన విధానంగా మారాలని ఆయన పిలుపునిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: