హర్యానాలోని (Haryana) ఫరీదాబాద్‌లో ఓ హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది.హోమ్ స్కూలింగ్ సెషన్లో నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి 1 నుంచి 50 వరకు అంకెలను రాయలేకపోయిందన్న కోపంతో, ఆమెను కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా ఖేరతియా గ్రామానికి చెందిన కృష్ణ జైస్వాల్, కుటుంబంతో కలిసి ఫరీదాబాద్ (Haryana)లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.జైస్వాల్, అతని భార్య ఇద్దరూ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.
Read Also: AP: ఓర్నీ ఇదెక్కడి చోరీ.. మద్యం తాగడానికి డబ్బుల కోసం బస్సునే ఎత్తుకెళ్లాడు

తండ్రిని రిమాండ్ కు తరలించిన పోలీసులు
పగటిపూట తల్లి పని చేస్తుండగా, తండ్రి ఇంట్లో పిల్లలను పర్యవేక్షించేవాడు, ముఖ్యంగా కుమార్తె చదువును చూస్తుంటాడు.ఈ నెల 21న ఇంట్లో కూతురికి చదువు చెబుతున్న సమయంలో 50 వరకు అంకెలు రాయమని చెప్పగా పాప రాయలేకపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన కృష్ణ, కూతురిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.ఈ దాడి కారణంగా చిన్నారి తీవ్రంగా గాయపడి, చివరకు ప్రాణాలు కోల్పోయింది.సాయంత్రం తల్లి ఇంటికి తిరిగి వచ్చి, కుమార్తె అచేతనంగా పడి ఉండటాన్ని గమనించింది.
వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాప స్కూల్‌కు వెళ్లడం లేదని, తానే ఇంట్లో చదివిస్తున్నానని, అంకెలు సరిగా రాయలేకపోవడంతో కోపం వచ్చి కొట్టానని నిందితుడు విచారణలో చెప్పాడు.నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, ఒకరోజు పోలీస్ రిమాండ్‌కు అప్పగించారు.ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: