ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల (Republic Day 2026) నేపథ్యంలో, నగరంలోని పరేడ్ గ్రౌండ్లో రిహార్సల్స్‌ను అధికారులు నిర్వహించారు.ఈ రిహార్సల్స్‌లో త్రివిధ దళాల అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని పరేడ్ విన్యాసాలను అభ్యసించారు. పరేడ్‌లో భాగంగా మార్చ్‌పాస్ట్, గౌరవ వందనం, ఇతర సాంప్రదాయ కార్యక్రమాలను క్రమబద్ధంగా సాధన చేశారు. భద్రతా ఏర్పాట్లను మల్కాజిగిరి కమిషనర్ అవినాష్ మహంతి పరిశీలించారు. వేడుకలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు.గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఈ రిహార్సల్స్ ఎంతో ఉపయోగపడతాయని వారు అభిప్రాయపడ్డారు.










