జూనియర్ విద్యార్థులపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. డ్రింక్స్, సిగరెట్లు తీసుకురావాలని బలవంతం చేశారు. తమ ఆదేశాలు పాటించని జూనియర్లను కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (College Students Assault Juniors) కర్ణాటక రాజధాని బెంగళూరు(Bangalore)లో ఈ సంఘటన జరిగింది. దేవనహళ్లి ప్రాంతంలోని ఆకాష్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్‌కు చెందిన సీనియర్ విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. బీబీఏ, బీసీఏ విద్యార్థులను వేధించారు.
కాగా, జనవరి 15న సాయంత్రం 5 గంటల సమయంలో సిగరెట్లు, కూల్‌డ్రింక్స్ తీసుకురావాలని జూనియర్లను సీనియర్లు బలవంతం చేశారు. తమ మాట వినని జూనియర్లపై సీనియర్లు దాడి చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న అడ్మిషన్స్ హెడ్ మిదున్ మాధవన్ సీనియర్ విద్యార్థులను ప్రశ్నించేందుకు క్యాంపస్ వెనుక ఉన్న టీ స్టాల్ వద్దకు వెళ్లారు.
Read Also: China: డ్రైవర్ లేని బస్సులు..సాంకేతిక అద్భుతం
ఇనుపరాడ్లు, కర్రలు, రాళ్లతో జూనియర్లపై దాడులు
అయితే ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థులు రెచ్చిపోయారు. ఇనుపరాడ్లు, కర్రలు, రాళ్లతో జూనియర్లపై దాడులకు పాల్పడ్డారు. సీనియర్ స్టూడెంట్ బిలాల్ ఒక జూనియర్ మెడలో ఉన్న 32 గ్రాముల బంగారు గొలుసును లాక్కున్నాడు. సీనియర్ల దాడిలో కొందరు జూనియర్లు గాయపడ్డారు. మరోవైపు ఆకాష్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ అడ్మిషన్స్ హెడ్ మిదున్ మాధవన్ దీనిపై స్పందించారు. జూనియర్లపై ర్యాగింగ్, వేధింపులకు పాల్పడిన సీనియర్లపై దేవనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో 23 మంది సీనియర్ విద్యార్థులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: