భారత ప్రధాని నరేంద్ర మోదీని దేశంలోనే ‘అత్యంత గొప్ప చరిత్ర వక్రీకారుడు’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ (Jairam Ramesh) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన ప్రధానిపై అనేక విమర్శలు ేచశారు. గత నెలలో పార్లమెంటు వేదికగా ‘వందేమాతరం’ గీతంపై జరిగిన చర్చలో మోదీ చరిత్రను వక్రీకరించారని, రవీంద్రనాథ్ ఠాగూర్‌కు అపఖ్యాతి తెచ్చేలా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా, జాతిపిత మహాత్మా గాంధీ జ్ఞాపకాలను, వారసత్వాన్ని మోదీ తుడిచిపెట్టేస్తున్నారని ఆరోపించారు.
Read Also: Srinagar: భారీ వర్షం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దు

గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రతిష్ఠను దెబ్బతీశారు
జైరాం రమేశ్ ‘ఎక్స్’ వేదికగా ప్రధానిపై విరుచుకుపడ్డారు. “గత నెలలో పార్లమెంటులో జాతీయ గేయంపై చర్చ జరిగింది. ఆ సమయంలో ప్రధాని, ఆయన సహచరులు వాస్తవాలను వక్రీకరించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడారు. కానీ చివరికి వారి బండారం బయటపడింది. ప్రధాని ఉద్దేశపూర్వకంగానే చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుకే ఆయన దేశంలోనే ‘గ్రేటెస్ట్ డిస్టోరియన్’ (చరిత్రను వక్రీకరించేవాడు)” అని జైరాం రమేశ్ ఘాటుగా విమర్శించారు. నేతాజీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని జైరాం రమేశ్ కొన్ని చారిత్రక అంశాలను ప్రస్తావించారు. “1937లో వందేమాతరం గీతంలోని తర్వాతి చరణాలపై ఒక వివాదం నడిచింది. ఆ వివాదాన్ని పరిష్కరించడంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించారు. కానీ పార్లమెంటు చర్చలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారు. ప్రజలకు నిజాలు తెలియకుండా చేశారు” అని ఆరోపించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: