ఉత్తరప్రదేశ్ (UP) లో చోటుచేసుకున్న ఓ ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జౌన్‌పూర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల సూరజ్ భాస్కర్ తన జీవిత లక్ష్యమైన డాక్టర్ కావాలనే కలను నెరవేర్చుకోవడానికి తీసుకున్న అత్యంత దారుణ నిర్ణయం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. MBBS సీటు సాధించాలని, దివ్యాంగుల కోటా (PwD quota) కింద అర్హత పొందేందుకు తన కాలు తానే నరుక్కోవడం సంచలనంగా మారింది.
Read Also: Annamayya District: ఇదేం పైత్యంరా! ఆవుపై అఘాయిత్యమా!

విమర్శలు
రెండుసార్లు నీట్ రాసినా సీటు రాకపోవడంతో, ప్రైవేట్ కాలేజీల్లో చదువుకునేందుకు డబ్బులు లేకపోవడంతో ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దుస్థితికి ప్రభుత్వాల వైఫల్యం కారణమని విమర్శలు వస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: