हिन्दी | Epaper
వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

Adivasis : ఆదివాసులకు అనాదిగా అన్యాయమే?

Sudha

ఆదివాసుల సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్నామని వేలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని ఒకపక్క నేతలు గొప్పలు చెప్పు కుంటున్నా, మరొకపక్క కనీస సదుపాయాలులేక అర్థాకలితో అల్లాడుతున్న లక్షలాది మంది గిరిపుత్రుల బాధలు వర్ణనాతీతం. వైద్య సదుపాయం మాట అటుంచి కడుపునిండా తిండిలేక పౌషకాహారం లోపించి, గిరిపుత్రు లు (Adivasis) అనేక వ్యాధులతోపాటు అంధులుగా మారుతున్నారనే వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. భావిభారత పౌరు లుగా ఎదగాల్సిన దేశవ్యాప్తంగా లక్షలాది మంది గిరిజన బాలబాలికలకు గ్లోకోమా, కెటరాక్ట్, విటమిన్ ఎ లోపంతో అంధులుగా మారే అవకాశాలున్నాయని సమాచారం ఆవేదన కలిగిస్తున్నది. సర్వేంద్రియాల్లో కళ్లు అత్యంత ప్రధాన మైనవి. అవే మూసుకుపోయి క్రమేపీ అంధత్వం ప్రాపిస్తే ఆ వ్యక్తితోపాటు కుటుంబ పరిస్థితి ఎంతదారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అవిద్య, అజ్ఞానం, మూఢత్వం, దారిద్య్రం, ప్రకృతితోపాటు తోటి మానవుడి దోపిడీతో గిరిజన ప్రాంతాలు నేటికీ అతలాకుతలం అవుతున్నాయి. గిరిజనులకు ప్రత్యేక ప్యాకేజీలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు కేటాయిస్తున్న కోట్లాది నిధుల్లో నాలుగోవంతు కూడా వారికి చేరడంలేదనే ఆరోపణలను తోసిపుచ్చలేం. స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా వారి కోసం ప్రత్యేకంగా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలు (ఐటిడిఏ) ఏర్పాటు చేసినా ఆశించిన ప్రయోజనాలు చేకూరడం లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వేలాది మంది ఆది వాసులకు రహదారి సౌకర్యం లేదు. నడవడానికి కూడా సరైన బాటలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. బస్సు ఎక్కనివారే కాదు, చూడనివారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అన్నింటికంటే ముఖ్యంగా విద్య, వైద్యం విషయంలో ఆ ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పొచ్చు. ప్రధానంగా సీజన్ మారినప్పు డల్లావారిపై విషజ్వరాలు విజృంభించడం ఎందరో అమా యకులు అసువులు బాయడం ప్రతియేటా సర్వసాధారణ మైపోయింది. భారతదేశంలో ఏడువందల ఐదు విభిన్న తెగలకు చెందిన దాదాపు పదకొండు కోట్ల మంది వరకు గిరిజనులు ఉన్నారని దశాబ్దం క్రితం వెల్లడించిన అంచ నాలు చెబుతున్నాయి. ఆరోగ్యం, పౌష్టికాహారం లాంటి కనీస మౌలిక వసతుల్లో కూడా ఆయా వర్గాలు వెనుక బడే ఉన్నాయి. ఆదివాసుల ఆరోగ్యపరిస్థితి అధ్యయనం చేయడానికి కేంద్రం పన్నెండేళ్లక్రితం ప్రముఖ గ్రామీణ ఆరోగ్యరంగ నిపుణులు అభయ్బంగ్ నేతృత్వంలో కమి టీని నియమించింది. ఆ కమిటీ దేశవ్యాప్తంగా అనేక ఆదివాసుల ప్రాంతాలు పర్యటించి అధ్యయనం అనం తరం 2018లో నివేదికను సమర్పించింది. మలేరియా కేసులు అత్యధికంగా ముప్పై శాతంపైగా ఆదివాసీ ప్రాంతా ల్లో వెలుగు చూస్తున్నాయని ప్రతి నలుగురు గిరిజనుల్లో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని స్పష్టం చేసింది. గిరిజనులు అనారోగ్యానికి మూలకారణమైన పొగాకు వినియోగం రానురాను పెరిగిపోతుండడం ఆందో ళన కలిగిస్తున్నది. పదిహేను నుంచి యాభైనాలుగేళ్ల ఆది వాసుల్లో పొగాకు అధికం అవ్వడం కారణంగా క్షయతో పాటు ఇతర వ్యాధులు ప్రబలిపోతున్నాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. మరోవైపు ఐదేళ్లలోపు ఆదివాసీ (Adivasis)చిన్నా రుల్లో నలభైశాతం సరైన పౌష్టికాహరం కొరవడి గిడస బారిపోతున్నారని పదహారు శాతం పిల్లల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని యునిసెఫ్ గతంలో తేల్చి చె ప్పింది. భారతదేశంలో మొత్తం గిరిజనుల్లో ఎనభైమూడు శాతం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్గఢ్, ఆంధ్ర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, జకార్ఖండ్, తదితర రాష్ట్రాల్లో ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాలు జమ్మూకాశ్మీర్, బీహార్తో పాటు తమిళనాడులో 15.3శాతం ఆదివాసులు నివసిస్తున్నారు. వీరి అవసరాలకుతగ్గట్టుగా నేటికీ వైద్య సౌకర్యాలు లేవనే చెప్పొచ్చు. ఇతర విషయాలు ఎలాఉన్నా గిరిజనుల విషయంలో వైద్యసేవలను నిర్లక్ష్యం చేయడం క్షమార్హం కాదు. వైద్యం, విద్య విషయంలో ప్రత్యే కించివారికి కేటాయించిన నిధులు వారికే అందేలా చూడ డంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. గిరి జనుల కోసం కేటాయించిన నిధులు దారిమళ్లించి ఇతర ప్రాంతాలకు తరలించడం పరిపాటిగా జరుగుతున్నది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 1970లో సాంఘిక సంక్షేమశాఖనుంచి విడదీసి ప్రత్యేకంగా గిరిజన సంక్షేమ శాఖను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొట్నాక భీమ్రావును తొలిగిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా నియమించారు. ఆయన మంత్రిగా పదవీ బాధ్య తలు చేపట్టగానే ఎంతోకాలంగా మూలపడి ఉన్న హేమం డర్స్ నివేదికను బయటకుతీసి ఆ సిఫారసులను అమలు చేసేందుకు నడుం బిగించారు. ఆనాడే గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఐటిడిఏ ఏర్పాటుకు నాంది పలికారు. వంద లాది కోట్లరూపాయలు కేటాయించి గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలకు భవనాలు నిర్మించి డాక్టర్లను కింది స్థాయి ఉద్యోగులను నియమించారు. కానీ వారిని అక్క డికి పంపడంలో విఫలమవుతున్నారు. దీనికితోడు ఆ ప్రాం తాల్లో సరఫరా అవుతున్న మందులు నాసిరకం కావడం తో రోగాలు తగ్గక నమ్మకం సన్నగిల్లి గిరిజనులు నాటు వైద్యం వైపు మొగ్గుచూపుతున్నారు. పసర్లు, వేర్లతో వచ్చీ రాని వైద్యం చేసుకొని ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా నేతలు వారి అభ్యు న్నతికి పాటుపడాలి. ముఖ్యంగా విద్య, వైద్యం వంటి. కనీస సదుపాయాలను అందించాల్సిన బాధ్యత నేతలపై ఉంది. దీనిని విస్మరిస్తే చరిత్ర క్షమించదు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870