Karnataka: ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల్లో బెంగళూరు మరోసారి టాప్ ర్యాంకుల్లో నిలిచింది. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ లొకేషన్ టెక్నాలజీ సంస్థ విడుదల చేసిన ‘టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ – 2025’ నివేదిక ప్రకారం, ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ట్రాఫిక్ ఒత్తిడి ఎదుర్కొంటున్న నగరాల జాబితాలో బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది.
Read Also: Telangana: మద్యం ప్రియులకు షాక్

మెక్సికో సిటీ ప్రపంచంలోనే అత్యంత రద్దీ నగరం
ఈ సూచీ ప్రకారం మెక్సికో సిటీ ప్రపంచంలోనే అత్యంత రద్దీ నగరంగా తొలి స్థానాన్ని దక్కించుకోగా, బెంగళూరు ఆ వెంటనే రెండో స్థానంలో ఉంది. భారత్ నుంచి పుణె ఐదో స్థానంలో నిలవగా, ముంబయి 18వ స్థానంలో, ఢిల్లీ 23వ స్థానంలో, కోల్‌కతా 29వ స్థానంలో, జైపుర్ 30వ స్థానంలో నిలిచాయి. చెన్నై 32వ స్థానాన్ని, హైదరాబాద్ 47వ స్థానాన్ని సాధించింది.
టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్(TomTom Traffic Index) ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో ట్రాఫిక్ పరిస్థితులను విశ్లేషిస్తుంది. ప్రయాణ సమయం, ట్రాఫిక్ జామ్‌లో గడిపే గంటలు, పీక్ అవర్స్‌లో వాహనాల సగటు వేగం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ర్యాంకింగ్స్‌ను ప్రకటిస్తుంది.
ఐటి రంగం కారణం
బెంగళూరులో వేగంగా పెరుగుతున్న వాహనాల సంఖ్య, ఐటి రంగం కారణంగా ట్రాఫిక్ తీవ్రత పెరగడం, రోడ్డు మౌలిక సదుపాయాల విస్తరణ సకాలంలో జరగకపోవడం వంటి కారణాలతో ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు మెట్రో విస్తరణ, ఫ్లైఓవర్లు, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: