Delhi weather : ఏడేళ్ల రికార్డు స్థాయి వేడికి ఢిల్లీలో బ్రేక్ పడింది. శుక్రవారం ఉదయం ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఉత్తర భారతదేశంపై ప్రభావం చూపుతున్న పశ్చిమ కల్లోలం కారణంగానే ఈ మార్పులు చోటుచేసుకున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
గురువారం ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 27.1 డిగ్రీల సెల్సియస్‌కు చేరి గత ఏడేళ్లలోనే అత్యధికంగా నమోదైంది. అయితే తాజా వర్షాల ప్రభావంతో శుక్రవారం ఉష్ణోగ్రతలు 18–20 డిగ్రీలకు పడిపోతాయని, శనివారం నాటికి 16–18 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశమూ ఉందని తెలిపింది.
Read Also: Udayanidhi Stalin: ఉదయనిధి వ్యాఖ్యలు హద్దులు దాటాయా? హైకోర్టు కీలక వ్యాఖ్యలు
వర్షాల కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడనుంది. (Delhi weather) ఇప్పటివరకు ‘వెరీ పూర్’ కేటగిరీలో ఉన్న AQI క్రమంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వర్షానికి ముందు నోయిడాలో AQI 329గా, ఘజియాబాద్‌లో 347గా నమోదైంది. ఈ వాతావరణ ప్రభావం శనివారం ఉదయం వరకు కొనసాగవచ్చని, జనవరి 26 నుంచి మరో పశ్చిమ కల్లోలం ఉత్తర భారతాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: