తెలంగాణ (TG) రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు.వచ్చే ఏడాది నుంచి రేషన్ దుకాణాల ద్వారా కేవలం సన్న బియ్యం మాత్రమే కాకుండా.. సన్న బియ్యంతో పాటు ఐదు రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, సన్న బియ్యం పంపిణీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని స్పష్టం చేశారు.
Read Also: SIT Notice : సిట్ విచారణను కార్తీకదీపం సీరియల్ తో పోల్చిన కేటీఆర్

అనుకూల విధానాల వల్లే
మరోవైపు 2025-26 వానాకాలం సీజన్‌లో 71.70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు జమ చేసినట్లు తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు అనుకూల విధానాల వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు. సేకరించిన మొత్తం ధాన్యంలో 38.37 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకాలు ఉండటం విశేషమని, సాంబ మసూరి, తెలంగాణ మసూరి వంటి రకాలను పండించే రైతులకు మేలు జాతి విత్తనాలను ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: