భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఇండోనేషియా మాస్టర్స్ 2026 టోర్నమెంట్ (Indonesia Masters 2026 tournament) లో డెన్మార్క్‌కు చెందిన హోజ్మార్క్‌పై గెలుపొందిన సింధు, తన అంతర్జాతీయ కెరీర్‌లో 500వ విజయాన్ని నమోదు చేశారు. ఈ ఘనత సాధించిన ఆరో మహిళా సింగిల్ ప్లేయర్‌గా పీవీ సింధు నిలిచారు. సింధు విన్నింగ్ పర్సంటేజీ 68.22%గా ఉంది.
Read Also: Gautam Gambhir: కోచ్ అధికారాలపై నిజాలు త్వరలోనే తెలుస్తాయి
గట్టి పోటీ
ఇండోనేషియా మాస్టర్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో సూపర్ విక్టరీ సాధించిన సింధు.. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నెం.4వ స్థానంలో ఉన్న చైనాకు చెందిన చెన్ యూ ఫీ రూపంలో గట్టి పోటీ ఎదుర్కోనుంది. వీరిద్దరు ఇప్పటి వరకు పదమూడు సార్లు ముఖాముఖి తలపడగా చెన్ 7, సింధు 6 సార్లు విజయం సాధించారు.
చివరగా 2019లో చెన్‌ను సింధు ఓడించింది. తన తదుపరి మ్యాచులో చెన్ పై విజయం సాధించి.. తన రికార్డును మెరుగుపర్చుకోవాలని సింధు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరోవైపు ఇదే టోర్నీలో లక్ష్య సేన్ సైతం క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. అరగంటకు పైగా సాగిన పోరులో హాంకాంగ్ షట్లర్ జేసన్ గునావన్‌పై 21-20, 21-11 తేడాతో గెలిచి లక్ష్య సేన్ ముందుడుగు వేశాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: