శ్రీకాకుళం : (AP) అరసవల్లి క్షేత్రంలో జరిగే రథసప్తమి వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌక ర్యం కలగకుండా అధి కారులు సమన్వయంతో పనిచేయాలని హోం మంత్రి అనిత (Anita) స్పష్టం చేశారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా రానున్న ఉత్సవాల ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ఉన్నతాధికారులతో కలిసి ఆమె ప్రత్యేకంగా సమీక్షించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లను క్రమబద్ధీకరించాలని, ముఖ్యంగా ట్రాఫిక్ మళ్లింపు విషయంలో ప్రజలకు ఇబ్బం దులు లేకుండా చూడాలని మంత్రి సూచించారు.
Read Also: Y S Jagan: యేడాదిన్నర తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను ప్రారంభిస్తా

భక్తుల భద్రతే ముఖ్యం అధికారులకు హోం మంత్రి
అధికారులు నిరంతరం క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండా లని, పోలీసు, రెవెన్యూ విభాగాల మధ్య సమన్వయం ఉంటేనే ఉత్సవాలను దిగ్విజయం చేయగ లమని ఆమె పేర్కొన్నారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిస్తూ, రథసప్తమి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు. (AP) అనంతరం జిల్లాలోని శాంతిభద్రతల పరిస్థితిపై అధికా రులతో చర్చించి పలు సూచనలు చేశారు. అంతకుముందు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాల యానికి చేరుకున్న హోం మంత్రికి జిల్లా యం త్రాంగం ఘన స్వాగతం పలికింది. ఈ కార్యక్ర మంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ మహేశ్వర్రెడ్డి, శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: