చంద్రగిరి : పట్టీల కోసం పోటెత్తిన ఆ పల్లె జనంతో ఆరేపల్లి రంగంపేట కిటకిటలాడింది. ఆరేపల్లి రంగంపేటలో కనుమ రోజున జరుపుకునే జల్లికట్టు సంబరాలను అనివార్య కారణలతో వాయిదా వేశారు. ఇందులో భాగంగా బుధవారం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, ఆరేపల్లి రంగంపేటలో జల్లికట్టు సంబరాలు అయిబరాన్నంటేలా నిర్వహించారు. పాడి రైతు ఎద్దుకు కట్టిన చెక్క పట్టీని ఒడిసి పట్టుకోవడం కోసం పోటెత్తిన పౌరుషంతో యువత పోరాటమే చేసింది. జల్లికట్టు సంబరాలకు వందలాది పాడి ఆవులను, ఎద్దులను ముస్తాబు చేశారు. ఏరువాకలో తమకు చేదోడుగా నిలిచి వండిన వంటలను ఇంటికి చేర్చే కాడెద్దులకు రైతులు పూజలు జరిపించి వాటిలోని ఉత్సాహాన్ని, పౌరుషాన్ని వెలికితీయడమే లక్ష్యంగా జల్లికట్టు సంబరాలు నిర్వహిస్తారు.
Read also: Chittoor: సీఎం చంద్రబాబు నగరి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

Jallikattu celebrations
ఈ క్రమంలో ఒక చెక్కతో అందంగా మలచబడిన పట్టీని పాడిరైతు తన ఎద్దు కొమ్ములకు కట్టి జనంలోకి వదలిపెడతాడు. తన ఎద్దు కొమ్ములకు కట్టిన పట్టీని గెలుచుకున్న యువత పౌరుషానికి ప్రతీకగా భావిస్తారు. జల్లికట్టు సంబరాలలో తమ పౌరుషాన్ని ధీటుగా ప్రదర్శించేందుకు యువత సైతం రెట్టించిన ఉత్సాహంతో పోటెత్తిన పోట్లగితలను నిలువరించి పట్టీని సొంతంచేసుకునేందుకే బరితెగించి యుద్ధమే చేశారు. ఈ సాహస కృత్యంలో పలువురు పల్టీలు కొట్టి గాయాలపాలయ్యారు.

Jallikattu celebrations
ఈ జల్లికట్టు సంబరాలను తిలకించేందుకు ఉష్ణుడి చిత్తూరు జిల్లాతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి వేలాది మంది చేరుకోవడంతో ఏ.రంగంపేట జనసంద్రమయ్యింది. జల్లికట్టు సంబరాలకు ప్రత్యేక స్థానం కలిగివుండటంతో సంబరాలకు ప్రారంభానికి ముందు చంద్రగిరి ఎంఎల్ఎ వులివర్తి నాని సందడి చేశారు. ఎంఎల్ఎ రాకతో పార్టీ నాయకులు, అభిమానులు అపూర్వ స్వాగతం! పలుకుతూ హోరెత్తిన కేరింతల నడుమ తమ అభిమాన నాయకుడిని భుజాలకెత్తుకుని మోసుకుంటూ గ్రామవీధులలో ఊరేగించారు. ప్రత్యేక పూజల అనంతరం జల్లికట్టు సంబరాలను అట్టహాసంగా ప్రారంభించారు.

Jallikattu celebrations
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: