కేవలం కొద్ది నిమిషాల్లోనే రుణం మంజూరు చేస్తామని, ఎలాంటి పత్రాలు అవసరం లేకుండా లోన్(Loan Scam) ఇస్తామని, రూ.5 లక్షల వరకు రుణం పొందవచ్చంటూ వచ్చే ఆకర్షణీయ ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సూచించింది.
Read also: IPL 2026: బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం

అధిక వడ్డీ, దాచిన ఛార్జీల ప్రమాదం
అత్యవసర అవసరాల సమయంలో కొందరు ఆన్లైన్ లోన్ యాప్లను ఆశ్రయిస్తున్నప్పటికీ, వీటి ద్వారా అధిక వడ్డీ రేట్లు, దాచిన ఛార్జీలు, ఆర్థిక మోసాలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నట్లు RBI హెచ్చరించింది.
బ్యాంకులు, NBFCల అధికారిక యాప్
ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ఏ సంస్థైనా తప్పనిసరిగా RBI అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. RBI లైసెన్సు పొందిన బ్యాంకులు మరియు బ్యాంకింగ్ ఆర్థిక సంస్థల (NBFCs) అధికారిక యాప్ల ద్వారా లోన్లు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొంది.
అయితే, RBI అనుమతి లేని, చట్టవిరుద్ధంగా ఆన్లైన్లో పనిచేసే లోన్ యాప్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని RBI స్పష్టంగా సూచించింది. ఇటువంటి యాప్ల వల్ల ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా వ్యక్తిగత డేటా దుర్వినియోగం అయ్యే అవకాశమూ ఉందని హెచ్చరించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: